సిరిసిల్ల: జిల్లా విద్యాధికారిగా జె.విజయసాగర్‌ను నియమిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో జవహర్‌బాల్ భవన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విజయసాగర్‌ను డీఈవోగా నియమించారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జి డీఈవోగా పనిచేసిన ఎస్.మొండయ్యను డైట్ లెక్చరర్‌గా కొనసాగిస్తున్నారు. జిల్లా డీఈవోగా నియమితులైన విజయసాగర్‌కు కరీంనగర్ డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు జిల్లాల విద్యాధికారిగా వ్యవహరించనున్నారు.
సమస్యలు పరిష్కరించండి
సిరిసిల్లటౌన్: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్‌ఎన్పీడీసీఎల్ సీఎండీ వ రుణ్‌రెడ్డికి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరారు. ఈమేరకు బుధవారం వినతిపత్రం అందించి మాట్లాడా రు. పదోన్నతులు కల్పించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. జిల్లా అధ్యక్షు డు అనుముల మహేందర్, రీజినల్ సెక్రటరీ మరేందర్, ప్రవీణ్‌కుమార్, తిరుపతి, రమణా రెడ్డి, శ్రీనివాస్, సమీర్, రవీందర్ పాల్గొన్నారు.
పోటీతత్వంతో బోధించాలి
సిరిసిల్లటౌన్: ప్రభుత్వ ఉపాధ్యాయులు పోటీతత్వంలో బోధించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి కోరారు. జిల్లా శాఖ అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ 2003 వారికి పాత పెన్షన్ అమల్లోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా గన్నమనేని శ్రీనివాసరావు, ఎడ్ల కిషన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాన కార్యదర్శి నరహరి లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముస్కు తిరుపతిరెడ్డి, వేముల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
‘మల్కపేట’ నుంచి నీరు విడుదల
ఎల్లారెడ్డిపేట: మల్కపేట రిజర్వాయర్ నుంచి 9వ ప్యాకేజీ కాలువ ద్వారా నీటిని బుధవారం విడుదల చేశారు. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ మల్కపేట రిజర్వాయర్ నుంచి 9వ ప్యాకేజీ కా లువ ద్వారా నీటిని విడుదల చేయించిన ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి, బుగ్గరాజేశ్వరతండా, అల్మాస్‌పూర్, కిష్టునాయక్‌తండా, బాకూర్‌పల్లి, బాకూర్‌పల్లితండా, రాచర్లతిమ్మాపూర్ పరిధిలోని పంటలకు నీరందుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండలా ధ్యక్షుడు సూడిద రాజేందర్, సర్పంచులు కల్లూ రి బాపురెడ్డి, నాగెల్లి వెంకటరెడ్డి, మాదాసు స్రవంతి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి
● ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి: గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండల కేంద్రంలో రూ.12కోట్లతో మినీస్టేడియానికి పరిపాలన అనుమతులు రావడంతో బుధవారం మండల కాంగ్రెస్ నాయకులు ఒగ్గుడోలు చప్పుళ్లు.. టపాసులు పేల్చి సంబరాలు చే శారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే సత్యం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందనడానికి బోయినపల్లికి మినీస్టేడియం మంజూరుకావ డం నిదర్శనమన్నారు. ప్యాక్స్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ సుధాకర్, బీసీ సెల్ జిల్లా అ ధ్యక్షుడు కూస రవీందర్, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సువీన్, మహేశ్‌రెడ్డి పాల్గొన్నారు.


