సిరిసిల్ల: రాజీకి అవకాశం ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ అన్నారు. జిల్లా కోర్టు హాల్‌లో మంగళవారం మీడియేషన్ 3.0 డ్రైవ్‌పై మాట్లాడారు. అక్టోబరు 1 నుంచి 31 తేదీ వరకు మీడియేషన్ 3.0పై క్యాంపెయిన్ జరుగుతుందన్నారు. చిన్నచిన్న వివాదాలు పెద్ద సమస్యలుగా మారకుండా చర్చలు, పరస్పర అవగాహనతో సామరస్యంతో పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి, వాటిని మధ్యవర్తిత్వానికి రిఫర్ చేయడం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వైవాహిక, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, సివిల్ కేసులను మధ్యవర్తిత్వంతో పరిష్కారం లభిస్తుందన్నారు. కేసులు పరిష్కారమైతే.. సమయం, ఖర్చు, మానసిక ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మధ్యవర్తిత్వ ప్రక్రియను నిర్వహించేందుకు 17 మంది శిక్షణ పొందిన మీడియేటర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మణాచారి, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అంగన్‌వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. 9వ పోషణమాసంలో భాగంగా ఎల్లారెడిపేటలోని అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం 10నిమిషాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోషణ మాసం ప్రాముఖ్యతను గర్భిణులు, బాలింతలు పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి మంగళవారం 10 నిమి షాలు కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంట్లో, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూ సుకోవాలన్నా రు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపుని చ్చారు. మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, జిల్లా సంక్షేమశాఖ అధికారి లక్ష్మీరాజం, డీఎంహెచ్ వో ఏంజెలా ఆల్ఫ్రెడ్, తహసీల్దార్ రజనీ, ఎంపీడీవో సత్తయ్య, సర్పంచ్ నరసింహులు పాల్గొన్నారు.
సిరిసిల్ల: సిరిసిల్ల ప్రాంత స్వరూపాన్ని, రూపురేఖలను మార్చింది బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. కరీంనగర్ కలెక్టరేట్ కట్టించింది కేసీఆర్ అని, కాగా, రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవానికి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎట్లుండే సిరిసిల్ల.. ఎట్టా మారిందో సీఎం తెలుసుకోవాలన్నారు. ఈ మూడేళ్లలో సిరిసిల్లలో ఉపాధి లేక 35 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. రైతులకు, చేనేత కార్మికులకు బీమా పథకం ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. మధ్యమానేరు పూర్తి చేసింది, నిర్వాసితులకు అండగా నిలిచింది కేసీఆర్ సర్కారే అని..90 శాతం సమస్యలు పరిష్కరించామన్నారు. మధ్యమానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాల ని, ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు ఇవ్వాలని డి మాండ్ చేశారు. సిరిసిల్ల అభివృద్ధికి మూడేళ్లుగా ఒక్క రూపాయి ఇవ్వని సీఎం ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టడం ఒక్కటే రేవంత్‌రెడ్డికి తెలిసిన విద్య అన్నారు. సిరిసిల్లకు ఉత్త చేతులతో రావద్దు.. హామీలు అమలు చేయాలన్నారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ అకునూరి శంకరయ్య, బోయినపల్లి మండలఅధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, కుంబాల మల్లారెడ్డి పాల్గొన్నారు.


