1,600 మందితో పోలీసు భద్రత | - | Sakshi
Sakshi News home page

1,600 మందితో పోలీసు భద్రత

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

సిరిసిల్ల: జిల్లాకేంద్రంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని ఎస్పీ మహేశ్‌ బి గితే తెలిపారు. సిరిసిల్ల శివారులోని కల్యాణ లక్ష్మీగార్డెన్స్‌లో మంగళవారం బందోబస్తు విధులపై సిబ్బందికి ఎస్పీ దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లలో భాగంగా బందోబస్తును 12 సెక్టార్లుగా విభజించి, సుమారు 1600 పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో ఇద్దరు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 50 మంది సీఐ, ఆర్‌ఐలు, ఎస్సైలు, 148 మంది ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, 328 మంది కానిస్టేబుల్‌లు 482 మహిళ సిబ్బంది 121 హోమ్‌ గార్డ్స్‌ 196 మంది బెటాలియన్‌ సిబ్బంది 60 మంది డిస్ట్రిక్ట్‌ గార్డ్స్‌ 190 మంది ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారులకు, సిబ్బందికి కేటాయించిన డ్యూటీ పాయింట్స్‌లలో అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని, ముఖ్యంగా పార్కింగ్‌ ప్రదేశాల్లో, ట్రాఫిక్‌ విధులలో ఉన్న సిబ్బంది ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సీఎం భద్రత ఏర్పాట్లపై రిహార్సల్స్‌

సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో మంగళవారం సాయంత్రం పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. మల్టీ జోన్‌ ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, వీ.బీ. కమలాసన్‌రెడ్డి (రిటైర్డ్‌) ఓఎస్‌డీ ఐఎస్‌డబ్ల్యూ ,డైరెక్టర్‌ టీజిఐసీసీసీ, సీఎం భద్రత విభాగం ఎస్పీ చక్రవర్తి, ఎస్పీ మహేష్‌ బి. గితే , కామారెడ్డి ఎస్పీ రాజేశ్‌ చంద్రలతో కలిసి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిరిసిల్ల జూనియర్‌ కాలేజీ మైదానంలోని హెలిప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణం వరకు ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో రిహార్సల్స్‌ నిర్వహించారు. రూట్‌ క్లియరెన్స్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల కాన్వాయ్‌ రాకపోకలు, బారికేడ్ల ఏర్పాటు తదితర భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement