సిరిసిల్ల: భూముల అవకతవకలపై కమిటీ సభ్యుడు, జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జీవో నంబర్ 134 ప్రకారం భూములపై నియమించిన కమిటీ సభ్యుడు సందీప్ కుమార్ ఝా, కలెక్టర్ గరీమా అగ్రవాల్, జిల్లాలోని తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములపై సమీక్షించి.. భూములు అవకతవకలు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
పోషకాహారంతో ఆరోగ్యం
బోయినపల్లి(చొప్పదండి): మహిళలు పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని జిల్లా ఉద్యాన అధికారి, మండల ప్రత్యేకాధికారి శరత్‌బాబు పేర్కొన్నారు. స్తంభంపల్లి, విలాసాగర్ గ్రామాల్లో మంగళవారం పోషణమాసం నిర్వహించారు. స్తంభంపల్లిలో పాల్గొన్న శరత్‌బాబు పోషకాహార ఆవశ్యకత గురించి వివరించారు. ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీధర్, సర్పంచులు బొంగాని అశోక్, ఏనుగుల కనుకయ్య, సూపర్‌వైజర్ నిర్మల, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎం, ఆశాలు తదితరులు ఉన్నారు.


