● మంత్రులు శ్రీధర్‌, పొన్నం, అడ్లూరి, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ | - | Sakshi
Sakshi News home page

● మంత్రులు శ్రీధర్‌, పొన్నం, అడ్లూరి, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌

Sep 30 2026 1:34 AM | Updated on Sep 30 2026 1:34 AM

● మంత్రులు శ్రీధర్‌, పొన్నం, అడ్లూరి, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌

సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల)/సిరిసిల్ల అర్బన్‌/వేములవాడ/గంభీరావుపేట(సిరిసిల్ల): రాష్ట్రంలో రెండున్నర ఏళ్లుగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న ప్రజాప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వా దం ఇవ్వాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. జిల్లాకేంద్రంలో సీఎం సభాస్థలాన్ని మంగళవారం రాత్రిపరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది ప్రజాప్రభుత్వం.. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నాందీ పలుకుతూ.. ముందుకు వెళ్తున్నామన్నారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు పడకుంటే.. దురదృష్టవశాత్తు జరిగే కొన్ని సంఘటనతో బీఆర్‌ఎస్‌, బీజేపీలు పార్టీల నాయకులు సంతోషపడుతూ.. రాజకీయాలు చేస్తున్నామని, వా రికి జ్ఞానోదయం కలగాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 33 నెలలుగా గతంలో అమలైన పథకాలను కొనసాగిస్తూనే.. కొత్తగా సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, కొత్త రేషన్‌కార్డులు వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఏడాదికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి మాజీ సీఎం కేసీఆర్‌ శఠకోపం పెట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. ఎల్లారెడ్డిపేట, వేములవాడలో ముఖ్యమంత్రి జనసమీకరణలో భాగంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల పరిధిలోని చిన్నబోనాల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు సూది రాజేందర్‌, సద్ది లక్ష్మారెడ్డి, నేవూరి వెంకట్‌రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పాల్గొన్నారు. గత పాలనలో సిరిసిల్ల ప్రజలు విసిగిపోయారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. గంభీరావుపేటలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. బుధవారం సిరిసిల్లలో నిర్వహించనున్న సభలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక సందేశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి, రైతుల సమస్యలు, నేత కార్మికుల సంక్షేమంపై సీఎం మాట్లాడుతారన్నారు. సభను విజయవంతం చేయాలని, గ్రామాల వారీగా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుపతిగౌడ్‌, కొమిరిశెట్టి తిరుపతి, హమీద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement