సిరిసిల్ల అర్బన్: ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్(ఏఐపీసీ) చైర్‌పర్సన్‌గా నియమితులైన టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్‌ను టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు బుర్ర రవితేజగౌడ్ ఆదివారం కలిశారు. ఉస్మానియా విద్యార్థి నాయకులు వెంకట్, మహేశ్, పవన్ ఉన్నారు.
విద్యుత్‌షాక్‌తో పాడిగేదె మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రేపాకలో విద్యుత్ షాక్‌తో ఆదివారం పాడిగేదె మృతిచెందింది. గ్రామానికి చెందిన కోదని బాలయ్య తన పాడి గేదెను మేత కోసం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఉన్న 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఎర్త్ వైర్ తగిలి చనిపోయినట్లు ఎన్పీడీసీఎల్ ఏఈ నగేశ్‌కుమార్ తెలిపారు. ఎక్స్‌గ్రేషియా కోసం ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు.


