సిరిసిల్లటౌన్: బీఆర్‌ఎస్ నేతలు తీరు మార్చుకోవాలని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు సూచించా రు. 39 వార్డుల కాంగ్రెస్ అధ్యక్షులు, క మిటీలతో ఆదివారం నిర్వహించిన స మావేశంలో పాల్గొన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, వెంగల లక్ష్మీనర్సయ్య, వెంగల అశోక్, కంసాల మల్లేశం పాల్గొన్నారు.
లోక్ అదాలత్ సక్సెస్ : ఎస్పీ
సిరిసిల్ల: జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సక్సెస్ అయిందని, దీని ద్వారా అనేక కేసులు పరిష్కారమయ్యాయని ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదివారం తెలిపారు. సైబర్‌క్రైమ్ బాధితులకు రూ.2,79,030లకు పైగా రీఫండ్ అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. విచారణలో ఉన్న 228 కేసులు, 56 పెట్టి, 823 డ్రంకెన్‌డ్రైవ్, 11,456 ట్రాఫిక్ చలాన్, 75 సైబర్‌క్రైమ్ కేసులు పరిష్కారమైనట్లు వివరించారు. కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐ శ్రావణ్‌యాదవ్ తదితరులను ఎస్పీ అభినందించారు.


