● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల అర్బన్: వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సర్ధాపూర్ మార్కెట్ యార్డులో రూ.1.30కోట్లతో నిర్మించే ప్రహరీ పనులకు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూపతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ మార్కెట్ యార్డుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ నర్సింగంగౌడ్, కౌన్సిలర్లు దొంతినేని కల్యాణి, ఆడెపు చంద్రకళ, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత తదితరులు పాల్గొన్నారు.
శ్రీసాయి ఇండస్ట్రీస్ ప్రారంభం
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం సంకెపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీసాయి ఇండస్ట్రీస్‌ను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం పరిశ్రమలోని వివిధ విభాగాలను పరిశీలించారు. విప్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల స్థాపనతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.


