● అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో నూతన న్యాయస్థాన భవన సముదాయానికి శనివారం శంకుస్థాపన చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ గురువారం తెలిపారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.తుకారాంజీ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. వీరితోపాటు జస్టిస్ పి.శ్యామ్‌కోసి, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ విజయసేన్‌రెడ్డి, జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు, జస్టిస్ నందికొండ నర్సింగరావు హాజరవుతున్నట్లు సిరిసిల్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాసరావు తెలిపారు.


