ఇల్లంతకుంట(వేములవాడ): మండలంలోని పెద్దలింగాపూర్‌లో రైతులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం 24వ రోజుకు చేరా యి. అసంపూర్తి కాలువను పూర్తి చేయాలనే డి మాండ్‌తో రైతులు దీక్షలు చేస్తున్నారు. శిబిరంలో రైతులు కరికే నవీన్‌కుమార్, రౌతు నారా యణ, ఎల్లం శ్రీనివాస్, కమటం శ్రీధర్, అబ్దుల్లా, రాజయ్య, గాదె మహేశ్ పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సాగునీటి కాలువలు పూర్తిచేయాలని కోరుతూ తంగళ్లపల్లిలో రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష గురువారం ఆరో రోజుకు చేరింది. రైతులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్డీ3, ఎల్‌ఎం6, 4 కాలువలు పూర్తి చేయాలని కోరారు. బీజేవైఎం మండ ల అధ్యక్షుడు, అంకిరెడ్డిపల్లె సర్పంచ్ రాగుల రాజిరెడ్డి, జిల్లా నాయకుడు ఆసాని రాంలింగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్స్, స్వీపర్లకు ప్రతీ నెల వేతనాలు మంజూరు చేయాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాల స్వీపర్స్, స్కావెంజర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్‌యాదవ్ కోరారు. కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. 8 నెలలు గడుస్తున్నా వేతనాలు ఇవ్వలేదన్నారు. నాయకులు బొడ్డు నర్సవ్వ, వరలక్ష్మి, రమేశ్, అంజయ్య, మహేశ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పశువుల కాపరులు, రైతులు అడవుల సంరక్షణలో భాగస్వాములు కావాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనాదేవి, డిప్యూటీ రేంజ్ అధికారి మోహన్‌లాల్ కోరారు. మండలంలోని అక్కపల్లిలో ఉపాధిహామీ కూలీలు, పశువుల కాపరులు, రైతులకు వేసవిలో అడవిలో జరిగే అగ్ని ప్రమాదాల నివారణపై గురువారం అవగాహన కల్పించారు. మంటలను అదుపు చేయడానికి ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ బాబు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
సీఐల బదిలీ
సిరిసిల్ల క్రైం: మల్టీజోన్–1 పరిధిలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు, నియామకాలు చేపట్టినట్లు ఐజీపీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలన కారణాలతో సీఐల బదిలీలు జరిగినట్లు పేర్కొన్నారు. ఉత్తర్వుల ప్రకారం కామారెడ్డి సీసీఎస్‌లో పనిచేస్తున్న నెమ్మని శ్రీనివాస్‌ను సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా నియమించారు. ప్రస్తుతం సిరిసిల్ల టౌన్ ఎస్‌హెచ్‌వోగా ఉన్న కస్పరాజు కృష్ణను మల్టీ జోన్–1 ఐజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కరీంనగర్ పీసీఆర్‌లో పనిచేస్తున్న ఓడెల వెంకటేశ్‌ను ఎల్లారెడ్డిపేట సీఐగా నియమించారు. ఎల్లారెడ్డిపేట సర్కిల్‌లో ఉన్న బలుసాని శ్రీనివాస్ మల్టీజోన్–1 ఐజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిరిసిల్ల డీసీఆర్‌బీలో పనిచేస్తున్న కదిరా నాగేశ్వరరావును సిరిసిల్ల రూరల్ సర్కిల్‌కు బదిలీ చేశారు. సిరిసిల్ల రూరల్ సర్కిల్‌లో ఉన్న కొలాని మొగిలిను డీసీఆర్‌బీ సీఐగా నియమించారు.


