సిరిసిల్లటౌన్: బహుజనులు రాజ్యాధికారం చేపట్టినప్పుడే దేశం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎనగందుల వెంకన్న పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బహుజనల రాజ్యాధికారంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని ఈనెల 15న సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాట అశోక్, నాయకులు లింగంపల్లి మహేశ్ పాల్గొన్నారు.


