
పిచ్చి మొక్కలు తొలగించాలి
ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగి దోమలు, పాములకు ఆవాసాలుగా మారుతున్నాయి. 12వ వార్డు చంద్రంపేట జ్యోతినగర్‌లో ఇళ్ల మధ్యలోనే పిచ్చిమొక్కలు పెరిగాయి. అఽధికారులు చర్యలు తీసుకోవాలి. – సుల్తాన్ బాల్‌రాజు, చంద్రంపేట
మా కాలనీకి సమీపంలోని మురికినీరు నిలిచి ఉంటుంది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకుంటలేరు. మాకు ఎప్పు డు ఏ వ్యాధి వస్తుందోనని ఆందోళన చెందుతున్నాం. రాత్రి అయితే చాలు దోమలను భరించలేకపోతున్నాం.
– సయ్యద్ హుస్సేన్, వీర్నపల్లి
పారిశుధ్య నిర్వహణపై చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ ప్లాట్లలో పిచ్చిమొక్కలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఆ స్థలాల యజమానులకు నోటీసులు అందజేస్తున్నాం. ఎవరి ప్లాట్లల్లో పెరిగిన పిచ్చిమొక్కులు వారే తొలగించాలని నోటీసు ద్వారా ఆదేశిస్తున్నాం. స్పందించని వారిపై చర్యలు తీసుకుంటాం.
– కిరణ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, సిరిసిల్ల

పిచ్చి మొక్కలు తొలగించాలి