
ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు
రాయికల్: సోదరికి ఆస్తి ఇస్తుందన్న కారణంతో తల్లిని హత్య చేశాడో కొడుకు. ఈ సంఘటన రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లె గంగరాజు(65)కు ఇద్దరు కుమారులు, కూతు రు సంతానం. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. భాగ్యను రామాజీపేటకు చెందిన ఓ వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. మొదటి కుమారుడు లక్ష్మణ్, రెండో కుమారుడు గంగారెడ్డి అదే గ్రామంలో వేర్వేరు కాపురాలు పెట్టారు. గంగరాజు భర్త ఎర్ర య్య ఐదేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో గంగరాజు తన పేరిట ఉన్న ఎకరం భూమితోపాటు రైతుభరోసా, పింఛన్ సొమ్మును కూతురు భాగ్యకు ఇస్తోంది. ఈ విషయమై గంగారెడ్డి తల్లిని పలుమార్లు మందలించాడు. అయినా ఆమె వినకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. అప్పటినుంచి తల్లిని వేధింపులకు పాల్పడుతున్నాడు. బుధవారం కూడా ఆమెను తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గంమధ్యలో మృతిచెందింది.