ఉపాధికి భరోసా ‘టీగేట్‌’ | - | Sakshi
Sakshi News home page

ఉపాధికి భరోసా ‘టీగేట్‌’

Aug 14 2025 6:55 AM | Updated on Aug 14 2025 6:58 AM

ఏటీసీలు, పరిశ్రమలకు వారధిగా..

జగిత్యాలలో అందుబాటులోకి

జగిత్యాలటౌన్‌: పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో (ఐటీఐ) చదువురు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించేందుకు.. వారిలో నైపుణ్య శిక్షణ (స్కిల్‌ ట్రైనింగ్‌) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్‌ సంయుక్త భాగస్వామ్యంతో అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఐటీఐలు, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లకు స్థానిక పరిశ్రమలతో ఒప్పందం (ఎంఓయూ) కుదిర్చి.. తెలంగాణ గేట్‌ ఫర్‌ ఆడాప్టింగ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (టీగేట్‌) జిల్లా కమిటీలను నియమించింది. కమిటీ వైస్‌ చైర్మన్‌గా జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, కన్వీనర్‌గా ఐటీఐ ప్రిన్సిపాల్‌, సభ్యులుగా జిల్లా ఉపాధి కల్పన అధికారి, ఒక ఎన్జీవో ఉంటారు. సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌తో కళాశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రయోగ పరికరాలు తదితర వసతులు కల్పిస్తారు. టీగేట్‌ ద్వారా స్థానిక పరిశ్రమల్లో అప్రెంటిషిప్‌ పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. శిక్షణలో మెలుకువలు నేర్పించి మంచి పనితీరు కనబరిచిన వారికి ఉద్యోగం పొందడంలో ముఖ్య భూమిక పోషించనుంది.

పారిశ్రామిక ప్రగతి దిశగా..

పారిశ్రామిక ప్రగతి పెంపు.. యువతకు వంద శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాల పెంపు లక్ష్యంగా ఇండస్ట్రీస్‌ 4.0 ప్రాజెక్టు కింద టాటా టెక్నాలజీస్‌ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఏటీసీలను ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి లభించే కోర్సులను ప్రారంభించింది. భోదన, శిక్షణకు అవసరమైన భవనాల నిర్మాణం, యంత్ర పరికరాలు, ఇన్‌స్ట్రక్టర్ల నియామకం, ఆధునిక శిక్షణ, సామగ్రికి టాటా టెక్నాలజీస్‌ నిధులు సమకూర్చింది. రూ.5కోట్లతో జగిత్యాలరూరల్‌ మండలం నర్సింగాపూర్‌ శివారులో ఏటీసీ భవనం నిర్మించారు. రెండేళ్ల వ్యవధితో కొత్త కోర్సులు ప్రారంభించారు.

ఉపాధి అవకాశాలు

ఐటీఐలు, ఏటీసీల్లో ప్రవేశపెట్టిన కొత్త కోర్సులు అభ్యసించిన విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో టీగేట్‌ కీలకపాత్ర పోషించనుంది. మెరుగైన శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించాలి. సమాజ నిర్మాణంలో పాలుపంచుకోవాలన్నదే లక్ష్యం.

– ఎం.సురేందర్‌, వైస్‌ చైర్మన్‌ టీగేట్‌

అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం అందిస్తున్న నూతన కోర్సులను అందిపుచ్చుకుని యు వత తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి. కొత్త కోర్సుల్లో చేరిన వారు కొత్త విషయాలు తెలుసుకోవాలి. సమాజానికి ఉపయోగపడేలా పనిచేయాలి.

గంట్యాల రవీందర్‌, కన్వీనర్‌ టీగేట్‌

కొత్త కోర్సులివే..

బేసిక్‌ డిజైనర్‌ అండ్‌ వర్చువల్‌ వెరిఫైర్‌(మెకానికల్‌)

అడ్వాన్స్‌డ్‌ సీఎన్‌సి మిషనింగ్‌ టెక్నీషియన్‌

మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌

ఏడాది కోర్సులు

మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ ఆటోమేషన్‌

ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌

ఆర్టీసన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌

ఈ కోర్సుల్లో ఏటా 172మంది విద్యార్థులు శిక్షణ పొందే వీలుంది.

ఉపాధికి భరోసా ‘టీగేట్‌’1
1/3

ఉపాధికి భరోసా ‘టీగేట్‌’

ఉపాధికి భరోసా ‘టీగేట్‌’2
2/3

ఉపాధికి భరోసా ‘టీగేట్‌’

ఉపాధికి భరోసా ‘టీగేట్‌’3
3/3

ఉపాధికి భరోసా ‘టీగేట్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement