
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● అంబేడ్కర్‌నగర్ అర్బన్ పీహెచ్‌సీ తనిఖీ
సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిపించాలని, డెలివరీల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సిబ్బంది హాజరు రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, మందుల రిజిస్టర్, వ్యాక్సిన్ గది, మందులు ఇచ్చే గదిని, అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలు ప్రభుత్వ దవాఖానాల్లో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ఆసుపత్రికి వచ్చే వారికి వివరించాలని సూచించారు. ఆస్పత్రి డాక్టర్ అభినయ్, వైద్య సిబ్బంది ఉన్నారు.