ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండి
● జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీనివాస్
గంభీరావుపేట(సిరిసిల్ల): తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీనివాస్ కోరారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు బుధవారం ఇంటింటీ ప్రచారం చేశారు. కళాశాల ప్రత్యేకతలు వివరిస్తూ రూపొందించిన ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీధర్, అధ్యాపకులు గజానంద్, శ్రీనివాస్, పాపారావు, సత్యనారాయణ, రవి, శ్రీధర్ పాల్గొన్నారు.
ఐటీఐలో ప్రవేశాలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): 2025–26 విద్యా సంవత్సరానికి ఐటీఐలో ప్రవేశాలకు 10వ తరగతి ఉత్తీర్ణులైన 14 ఏళ్లు నిండిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కవిత బుధవారం ప్రకటనలో తెలిపారు. జూన్ 21 వరకు మొదటి విడత దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, వెల్డర్, డీఎం సివిల్, డీజిల్ మెకానిక్, సీవోపీఏ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


