
రాజీవ్‌గాంధీ సేవలు స్ఫూర్తిదాయకం
సిరిసిల్లటౌన్: ప్రధానిగా రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ కొనియాడారు. రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం గాంధీచౌక్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నివాళి అర్పించారు. టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాస్ నాగుల సత్యనారాయణగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, యెల్లె లక్ష్మీనారాయణ, రాగుల జగన్, నక్క నర్సయ్య, కిరణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు పండగలు
● అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క
ముస్తాబాద్(సిరిసిల్ల): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా గ్రామీణ పండుగలు నిలుస్తాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. పోతుగల్‌లో గంగమ్మ ఆలయ వార్షికోత్సవానికి అమర్‌తో కలసి మంగళవారం పాల్గొన్నారు. విమలక్క మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విమలక్కను ఆలయ కమిటీ స భ్యులు సన్మానించారు. జెడ్పీటీసీ గుండం నర్సయ్య, కాంగ్రెస్ పార్లమెంట్ కో–కన్వీనర్ చక్రధర్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్ది గారి శ్రీనివాస్, అంజన్‌రావు, ఆలయ కమిటీ సభ్యులు పారిపెల్లి శ్రీనివాస్, జగన్, తోట ధర్మేందర్, అంజయ్య, మల్లేశ్ పాల్గొన్నారు.
అన్ని వసతులతో ఉన్నత విద్యనందించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం అన్ని సౌకర్యాలతో ఉన్నత విద్యనందించాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్‌కుమార్ కోరారు. ఎల్లారెడ్డిపేటలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నూతనంగా డిగ్రీ కళాశాలలో ల్యాబ్‌లు, తరగతి గదులు, అన్ని గ్రూపుల బోధన సిబ్బందిని నియమించాలని కోరారు. నాయకులు పెండ్యాల శివ, కొప్పుల నవీన్, మందాటి శివ ప్రసాద్, పవన్ పాల్గొన్నారు.
గల్ఫ్ కార్మికులకు అండగా ప్రభుత్వం
ముస్తాబాద్(సిరిసిల్ల): గల్ఫ్ కార్మిక కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ పార్టీ ఎన్‌ఆర్‌ఐ సెల్ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్ పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తోట ధర్మేందర్‌ను ముస్తాబాద్, పోతుగల్‌లో కాంగ్రెస్ పార్లమెంట్ కో–కన్వీనర్ కనమేని చక్రధర్‌రెడ్డి, జెడ్పీటీసీ గుండం నర్సయ్య మంగళవారం సన్మానించారు. ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు తలారి నర్సింలు, డీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీనివాస్, గజ్జెల రాజు, నరేశ్, రాజిరెడ్డి, బాల్‌రెడ్డి, అంజన్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
పట్టుపరిశ్రమ భూముల సర్వే
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని కోళ్లమద్దిలోని పట్టు పరిశ్రమకు సంబంధించి 27.11 ఎకరాల భూమి ఉంది. ఇటీవల భూ ములు అన్యాక్రాంతమవుతున్నాయని సంబంధిత శాఖ జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులకు విన్నవించారు. మంగళవారం పట్టుపరిశ్రమ శాఖ టెక్నికల్ ఏడీ దయాకర్‌రావు, జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి జగన్‌రావు ఆధ్వర్యంలో భూములను సర్వే చేశారు.

రాజీవ్‌గాంధీ సేవలు స్ఫూర్తిదాయకం

రాజీవ్‌గాంధీ సేవలు స్ఫూర్తిదాయకం

రాజీవ్‌గాంధీ సేవలు స్ఫూర్తిదాయకం

రాజీవ్‌గాంధీ సేవలు స్ఫూర్తిదాయకం