బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధపడ్డారు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధపడ్డారు

Nov 12 2023 12:48 AM | Updated on Nov 12 2023 12:48 AM

కోనాయపల్లిలో ఆది శ్రీనివాస్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథ్‌
 - Sakshi

కోనాయపల్లిలో ఆది శ్రీనివాస్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథ్‌

వేములవాడ/వేములవాడరూరల్‌: ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధపడ్డారని ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథ్‌ పేర్కొన్నారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని కోనాయపల్లిలో శనివారం రాత్రి గడప గడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని అభ్యర్థి ఆది శ్రీనివాస్‌తో కలిసి నిర్వహించారు. విశ్వనాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌కు ఈసారి తెలంగాణ ప్రజలు పట్టం కట్టనున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని గుర్తు చేశారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసిన ఘనత కేసీఆర్‌దేనని విమర్శించారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు డబ్బు సంచులతో వస్తున్నారన్నారు. ఈ సందర్భంగా దాదాపు 100 మంది యువకులు కాంగ్రెస్‌లో చేరారు. వేములవాడలోని పలు వార్డులలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, సీపీఐ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్‌ గౌడ్‌, కౌన్సిలర్‌ బింగి మహేశ్‌, రాజేశం, సాయిని అంజయ్య, కోయినేని శ్రీనివాస్‌, తూం మధు, పుల్కం రాజు, సాగరం వెంకటస్వామి, రంగు వెంకటేశ్‌గౌడ్‌, కనికరపు రాకేశ్‌, చిలుక రమేశ్‌, కూరగాయల కొమురయ్య, పాత సత్యలక్ష్మి, పులి రాంబాబుగౌడ్‌, బొందిల మహేశ్‌, కనికరపు రాకేశ్‌, కూరగాయల శ్రీశైలం, కడారి రాములు పాల్గొన్నారు.

మా ఓటు ఆది శీనన్నకే

వేములవాడ పట్టణ నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు, భగవంతరావునగర్‌కు చెందిన యాదవ సంఘం యూత్‌ ఆది శ్రీనివాస్‌కు మద్దతు ప్రకటించారు.

ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement