● మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ
సిరిసిల్లటౌన్: ఎస్సెస్సీ విద్యార్థులు పరీక్షలు భయంతో కాకుండా ఇష్టంతో రాయాలని.. అప్పుడే ఉన్నతంగా రాణిస్తారని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్ జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కౌన్సిలర్ సభ్యులు ఎర్ర వెంకటరాజం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొప్ప దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పెద్దలింగాపూర్‌లో రైతులు గత 31 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభమైన కాలువ పనులు పూర్తి చేయాలని రైతులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. పనులు మొదలుపెడితేనే దీక్ష విరమిస్తామని స్పష్టం చేశారు. కరికె నవీన్‌కుమార్, దుమాల శ్రీను, రేగుల భిక్షపతి, దొమ్మాటి మల్లయ్య, గాదె రవి, రౌతు నారాయణ, కొమ్ముల మోహన్, కీర్తి రాజు, మహేశ్, రవి, ఆనంద్ పాల్గొన్నారు
రూ.3.19కోట్లు విడుదల
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అసంపూర్తి కాలువ పనుల కోసం రూ.3.19 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. హైదరాబాదు నుంచి గురువారం ఫోన్‌లో మాట్లాడారు. త్వరలోనే కాలువ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
సిరిసిల్లటౌన్: సెస్ విద్యుత్ కార్మికులు చేపట్టిన 72 గంటల విధులు బహిష్కరణ గురువారం రెండో రోజుకు చేరింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్‌రావు మాట్లాడుతూ శుక్రవారం సెస్ కార్మికులు, కుటుంబ సభ్యులతో సహా పాల్గొంటారని తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన సెస్ విలేజ్ ప్రతినిధి రామచంద్రారెడ్డి, పద్మారెడ్డి సంఘీభావం తెలిపారు. శ్రీవేంకటేశ్వర ఐ హాస్పిటల్ భానుచందర్ మజ్జిక ప్యాకెట్లు అందించారు. ఆర్‌ఎంపీ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ మెంబర్ రాజమల్లు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్‌కుమార్, జిల్లా కార్యదర్శి నర్ర శ్రీనివాస్‌రెడ్డి, రవీంద్రప్రసాద్, విష్ణు, కరుణాకర్, భాస్కర్, సంతోష్‌నాయక్, రాచకొండ శ్రీనివాస్, తిరుపతినాయక్, నౌసిలాల్ పాల్గొన్నారు.
ఆశీర్వాద పాదయాత్రను విజయవంతం చేయండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొండగట్టు అంజన్న ఆ శీర్వాద పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. ఎల్లారెడ్డిపేటలో గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడా రు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ ఈ నెల 14న చేపట్టిన కొండగట్టు అంజన్న ఆశీ ర్వాదయాత్రకు తరలిరావాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, ప్రధాన కా ర్యదర్శులు గణేశ్, నరేశ్, బాలాగౌడ్ ఉన్నారు.


