
భూమి పూజ చేస్తున్న మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, గౌడ సంఘం నాయకులు
సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల పట్టణంలోని బైపాస్‌రోడ్డులో శాంతినగర్–నర్సింగ్ కళాశాల చౌరస్తా వద్ద సర్దార్ సర్వాయిపాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకు గురువారం భూమిపూజ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్‌గౌడ్, కన్వీనర్ బుర్ర నారాయణగౌడ్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్‌గౌడ్ మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పాపన్నగౌడ్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఈనెల 18న విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు బుర్ర లక్ష్మి, జాగీరు శైలు, గౌడసంఘం మహిళా అధ్యక్షురాలు అలేఖ్య, నాయకులు బొల్గం నాగరాజుగౌడ్, బండి దేవదాస్‌గౌడ్, రాజశేఖర్‌గౌడ్, భాస్కర్‌గౌడ్, మల్లికార్జున్‌గౌడ్, బండి శ్రీనివాస్‌గౌడ్, రామచంద్రంగౌడ్, కొండ రమేశ్‌గౌడ్, రామాగౌడ్, అజయ్‌గౌడ్, నేరేళ్ల శ్రీకాంత్‌గౌడ్, బుర్ర మల్లికార్జున్‌గౌడ్, సంతోష్‌గౌడ్, ప్రశాంత్‌గౌడ్, మల్లేశంగౌడ్, అనిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.