యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన! | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన!

Nov 18 2026 1:32 AM | Updated on Nov 18 2026 1:32 AM

● అధికారుల అండతో ఆగని నిర్మాణ పనులు

ఉలవపాడు: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ ఉలవపాడు మండల కేంద్రంలో ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అధికారుల అండదండలతో టీడీపీ నాయకులు రోజూ కొత్త పనులు ప్రారంభిస్తూ ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని భావిస్తున్న వార్డుల్లో పనులు మొదలుపెట్టి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీడీఓ సురేష్‌, పంచాయతీ కార్యదర్శి వీరయ్యల సహకారంతో ఈ తతంగం నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం రెండు రోడ్ల పనులు ప్రారంభించిన టీడీపీ నేతలు.. మంగళవారం కృష్ణనగర్‌లో డ్రైనేజీ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. కోడ్‌ అమలు చేయాల్సిన అధికారులే అధికార పార్టీ నాయకులకు దాసోహమై నిబంధనలు గాలికొదిలేయడం చర్చనీయాంశంగా మారింది. గత రెండేళ్లుగా గుర్తుకురాని అభివృద్ధి పనులు.. ఎన్నికల కోడ్‌ రాగానే ఎందుకు గుర్తొచ్చాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కోడ్‌ ఉల్లంఘనలకు సహకరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement