నామినేషన్లకు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు పటిష్ట బందోబస్తు

Nov 18 2026 1:32 AM | Updated on Nov 18 2026 1:32 AM

● ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా

మార్కాపురం టౌన్‌: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, బెస్తవారిపేట, కంభం, అర్థవీడు మండలాల్లో నవంబర్‌ 18 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, సీసీ కెమెరాలతో పాటు అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించి నిరంతర నిఘా ఉంచాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద క్యూలైన్‌ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనల ప్రకారం కేవలం అభ్యర్థులు, వారి ప్రతిపాదకులను మాత్రమే లోపలికి అనుమతించాలని స్పష్టం చేశారు. నామినేషన్‌ కేంద్రాల వద్దకు ర్యాలీలు, ఊరేగింపులతో గుంపులుగా రావడం, నినాదాలు చేయడం, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలకు అనుమతి లేదన్నారు. జిల్లాలో 30 పోలీస్‌ యాక్ట్‌, బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ వాటిని విధిగా పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

నామినేషన్‌ కేంద్రాలు పరిశీలించిన ఎస్పీ

అర్ధవీడు: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని పలు నామినేషన్‌ కేంద్రాలను జిల్లా ఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. నాగులవరం, మాగుటూరు, రంగాపురం, పెద్దకందుకూరు, అర్ధవీడు గ్రామ సచివాలయాల్లోని కేంద్రాలను ఆయన పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేలా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట కంభం సీఐ మల్లికార్జున ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement