పోలేరమ్మ గుడిలో హుండీ చోరీ | - | Sakshi
Sakshi News home page

పోలేరమ్మ గుడిలో హుండీ చోరీ

Nov 18 2026 1:32 AM | Updated on Nov 18 2026 1:32 AM

పోలేరమ్మ గుడిలో హుండీ చోరీ కారు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

● రూ.1.50 లక్షల నగదు అపహరణ

చీమకుర్తి రూరల్‌: మండలంలోని కేవీ పాలెం గ్రామంలోని పోలేరమ్మ దేవస్థానంలో సోమవా రం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, హుండీని పగులగొట్టారు. అందులోని సుమారు రూ.1.50 లక్షలకు పైగా నగదును అపహరించుకుపోయారు. మంగళవారం ఉదయం గుడి తలుపులు తెరిచి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌ టీమ్‌తో కలిసి ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

జరుగుమల్లి (సింగరాయకొండ): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన జరుగుమల్లి మండలం వావిలేటిపాడు జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి వావిలేటిపాడు జంక్షన్‌ వద్ద రోడ్డు దాటుతుండగా, ఒంగోలు వైపు వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. తెలుపు రంగుపై గ్రే కలర్‌ చారలున్న చొక్కా, కాఫీ కలర్‌ షార్ట్‌, లుంగీ ధరించి ఉన్నాడు. కుడిచేతికి ఎరుపు రంగు దారం ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించామని, ఆచూకీ తెలిసిన వారు జరుగుమల్లి పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై భాగ్యరాజ్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement