ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు ఇది పోలీసుల విజయమే వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, ఏజెంట్లను నిర్బంధించి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
„మిగతా 2లో..
ఒంగోలు సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదని..ప్రజా తీర్పునకు పోలీసు సంకెళ్లు వేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు పోలీసు వ్యవస్థను ఉపయోగించి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ దర్శి, కనిగిరి మున్సిపాలిటీల్లో నామినేషన్లు, స్క్రూటినీ సమయంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అడ్డుకున్నారని పేర్కొన్నారు. దర్శిలో సుమారు 300 మంది పోలీసులను మోహరించి తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కనిగిరిలోనూ స్క్రూటినీకి వెళ్తున్న అభ్యర్థులను, పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో జిల్లావ్యాప్తంగా 300 నుంచి 400 మంది పార్టీ నాయకులపై కేసులు నమోదు చేశారని, బైండోవర్ పేరుతో పోలీస్ స్టేషన్లకు పిలిపించి నిర్బంధించారని విమర్శించారు. పోలింగ్ రోజున కూడా తమ పార్టీ నాయకులు, అభ్యర్థులు, ఏజెంట్లను స్టేషన్లలో ఉంచి ఎన్నికల ప్రక్రియకు దూరం చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్, ఎస్పీ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినా ఆశించిన స్పందన రాలేదన్నారు.
ఒంగోలు, గిద్దలూరు, అద్దంకి, కనిగిరి తదితర ప్రాంతాల్లో పోలింగ్ ఏజెంట్లను బయటకు పంపించి, దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ఒంగోలులో మేయర్ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ను సైతం పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించారని విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థులు, నాయకులపై దాడులు, వేధింపులు జరిగినట్లు ఆరోపిస్తూ ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
ఒంగోలులో పార్టీ నాయకులు, ఎన్నికల ఏజెంట్లను పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారని, ఏజెంట్లను పంపించాలని కోరిన సమయంలో కేసులు నమోదు చేశారని మరో నాయకుడు ఆరోపించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కొండపి తదితర ప్రాంతాల నుంచి పోలీసులను రప్పించి మోహరించారని, ఏజెంట్లు లేని పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని విమర్శించారు. చీమకుర్తి నగరపాలక సంస్థ పరిధిలోని 14వ డివిజన్లో రీపోలింగ్ సందర్భంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓటింగ్ జరగడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి పేరం కోటేశ్వరి 18 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఓటు వేసే అవకాశం కల్పిస్తే ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఈ ఫలితం నిరూపించిందన్నారు. చీమకుర్తి, అద్దంకి, గిద్దలూరు, ఒంగోలు మున్సిపాలిటీలలో సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు మా ఏజెంట్లను లేకుండా చేసి దొంగ ఓట్లు వేసుకున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ గమనించాలని పోలీసువాళ్లే ప్రజలందరికీ సంకెళ్లు వేసి వారే ఏజెంట్లుగా అయి వాళ్లే ఓట్లు వేయించుకొని గెలిపించుకున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. గురువారం జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో బైండోవర్ చేయాలని అన్నీ స్టేషన్లకు పిలిపించి కూర్చోబెడతారన్నారు. ఇదేమి ఎలక్షన్లు చంద్రబాబు


