ముగిసిన పుర కౌంటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పుర కౌంటింగ్‌

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

మార్కాపురం టౌన్‌: మార్కాపురం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పురపాలక సంఘాల (మునిసిపల్‌) ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్వహించారు. మార్కాపురంలోని ఎస్‌వీకేపీ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో మార్కాపురం మున్సిపాలిటీ ఓట్లను లెక్కించారు. కౌంటింగ్‌ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.విజయ సునీత పర్యవేక్షించారు. జేసీ పులి శ్రీనివాసులు కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్‌ ప్రక్రియ, సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్‌ రూంలలో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్సులను పోలీసు భద్రత, రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో ప్రతి టేబుల్‌ వద్ద ఎన్నికల సిబ్బందిని నియమించి, ముందస్తుగా విధులు కేటాయించారు. కేంద్రాల్లో మౌలిక వసతులు, తాగునీరు, నిరంతర విద్యుత్‌ సరఫరా, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశారు.

మార్కాపురం మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో

విజేతలు

మార్కాపురం అర్బన్‌: మార్కాపురం మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు మంగళవారం నిర్వహించిన కౌంటింగ్‌లో విజేతలుగా నిలిచారు. మార్కాపురం పట్టణంలో మొత్తం 40 వార్డులకుగాను 19, 30, 31 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 37 వార్డులకు, 40 వార్డుల్లో చైర్మన్‌ అభ్యర్థులకు ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించారు. టీడీపీ 31, జనసేన 6, బీజేపీ 2, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గోలమారి కుమారి 32 ఓట్లతో 7వ వార్డులో విజయం సాధించారు.

మార్కాపురం కౌంటింగ్‌

కేంద్రంలో ఓట్లు

లెక్కిస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement