కూటమి మోసాలపై తిరుగుబాటు చేద్దాం | - | Sakshi
Sakshi News home page

కూటమి మోసాలపై తిరుగుబాటు చేద్దాం

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

కూటమి మోసాలపై తిరుగుబాటు చేద్దాం

కనిగిరి: చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పాలనపై తిరుగుబాటు చేద్దామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపిద్దామని పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ దద్దాల నారాయణ యాదవ్‌ అన్నారు. మండలంలోని గురువాజీపేట, తదితర పంచాయతీల్లో మంగళవారం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి మల్లెల ప్రవీణ్‌ కుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు మడతల కస్తూరిరెడ్డి, నాయకులతో కలిసి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినాజ.. సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. కూటమి నాయకుల దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందజేసినట్లు తెలిపారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలకు జగనన్న శ్రీకారం చుట్టారని వివరించారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. సుపరిపాలన, సంక్షేమ పాలన కావాలంటే ప్రజలంతా ఈ నెల 5వ తేదీ జరిగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసీ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మల్లెల ప్రవీణ్‌కుమార్‌, ఇతర అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దద్దాల నారాయణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు పోలక సిద్దారెడ్డి, డాక్టర్‌ ఆవుల కృష్ణారెడ్డి, చాగంరెడ్డి రాజారెడ్డి, కుమ్మరికుంట రవి, సంగటి మహేంద్రారెడ్డి, చందా నరసారెడ్డి, రాగిపిండి మధు, రెక్కల మాలకొండారెడ్డి, అంబటి వీర నాగిరెడ్డి, భాస్కర్‌, శనివారపు రమణారెడ్డి, మిట్టా రమేష్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేద్దాం

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపిద్దాం

పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement