లింగసముద్రం: కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేశారని కందుకూరు వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ విమర్శించారు. మంగళవారం ప్రాదేశిక ఎన్నిల చివరోజు ప్రచారం లింగసముద్రం మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో వేముల గోపాలరావు, ఆయన కుమారుడు వివేక్‌తో కలిసి బుర్రా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరై బుర్రాకు బ్రహ్మరథం పట్టారు. అనంతరం బుర్రా మాట్లాడుతూ ఎమ్మెలే ఇంటూరి నాగేశ్వరరావు నామినేషన్లు అడ్డుకుని టీడీపీ గూండాలు, రౌడీలు, పోలీసులు, అధికారులతో కుమ్మకై ్క నామినేషన్ పేపర్లు చింపివేశారని, సక్రమంగా మొత్తం 11 స్థానాలకు నామినేషన్లు వేస్తే ఎక్కడ ఓడిపోతామోనని భయపడి పత్రాలు లాక్కుని చించివేశారని, ఇదంతా కందుకూరు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కందుకూరును అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే చెబుతున్నారని, అభివృద్ధి చేస్తే స్వచ్ఛందంగా ఎన్నికలు జరపడానికి భయమెందుకయ్యా, అభివృద్ధి చేస్తే మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తారు కదా.. ఆయనకు ఒకటే భయం రెండున్నర సంవత్సరాల్లో పూర్తిగా అవినీతిమయం చేయడంతో సక్రమంగా ఎన్నికలు జరిగితే ఓడిపోవడం ఖాయమని భావించి ఇలాంటి పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ తాను ఇస్తానని, వాటితో పాటు సూపర్‌సిక్స్ ఇస్తానని చంద్రబాబు చెప్పారని, జగనన్న పథకాలు, సూపర్‌సిక్స్ ఇవ్వడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఇక ఎమ్మెల్యే అయితే మట్టి, ఇసుక అమ్ముకుని అంతా అవినీతి మయం చేశారని విమర్శించారు. మొగిలిచర్ల ప్రాదేశికంలో గ్రామస్తులను భయపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, భూముల ఆన్‌లైన్ తొలగిస్తామని, పింఛన్లు, సంక్షేమ పథకాలు తీసివేస్తామని ప్రజలను బెదిరిస్తున్నారని, ఒకవేళ దుర్మార్గంగా టీడీపీ నాయకులు ప్రవర్తిస్తే 2029లో జగనన్న ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యే కాగానే మీకు అన్ని పథకాలు, పింఛన్లు ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. జెడ్పీటీసీ అభ్యర్థి వంటేల శ్రీనివాసులు, ఎంపటీసీ అభ్యర్థులు బండి రాజమ్మ, పెంట్రాల ఎంపీపీ అభ్యర్థి కిలారి సురేంద్ర, మిగిలిన ఎంపీటీసీ అభ్యర్థులకు ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మండలంలో జెడ్పీటీసీ, ఆరు స్థానాల్లో మనమే గెలుస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెన్నా కృష్ణయ్య, కన్వీనర్ నోటి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు గణేశం గంగిరెడ్డి, కొలికి కొండలరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మొగిలిచర్లలో బుర్రాకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు


