సింగరాయకొండ: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తుఫాన్ హెచ్చరికల కేంద్రం నిరుపయోగంగా మారింది. గత టీడీపీ ప్రభుత్వంలో తుఫాన్లు వచ్చినప్పుడు తీర ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేసే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా టవర్, బ్యాటరీలు, సిస్టం ఏర్పాటు చేశారు. పరికరాలు సరఫరా చేశారేగానీ వాటిని పనిచేసేలా ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం పరికరాలన్నీ నిరుపయోగం మారగా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన హెచ్చరికల వ్యవస్థ పనికి రాకుండా పోయింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తుఫాన్ హెచ్చరికల కేంద్రం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


