కొనకనమిట్ల: కూటమి ప్రభుత్వ పాలనలో హామీలు నెరవేర్చకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని దుర్మార్గాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారని, ఓటమి భయంతో మాయమాటలతో ప్రజల్ని మభ్యపెట్టలేరని వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, ఉడుముల శ్రీనివాసులరెడ్డి టీడీపీ నాయకులను హెచ్చరించారు. జెడ్పీ చైర్మన్‌గా పోటీ చేస్తున్న డాక్టర్ కోటపాటి సుధాకర్‌రెడ్డిని, మండలంలో వైఎస్సార్ సీపీ తరఫున ఎంపీటీసీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మంగళవారం మండలంలోని చినారికట్ల, పెదారికట్ల, చినమనగుండం, మునగపాడు, గొట్లగట్టు, కొనకనమిట్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులు మోరబోయిన మురళీకృష్ణ, మూలె శివకోటిరెడ్డి, కసిబిసి తిరుపతమ్మ, పసల చెన్నకేశవులు, పెరికె బాలగురవమ్మ, వేంపాటి పోలిరెడ్డిల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. జెడ్పీటీసీ అభ్యర్థి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తనను ఆశీర్వదించి గెలిపిస్తే జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యేలు అన్నా, ఉడుముల


