యర్రగొండపాలెం:
పట్టణంలో మంగళవారం వైఎస్సార్ సీపీ జెండాలు రెపరెపలాడాయి. పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిని పాత్లావత్ లక్ష్మీబాయి రాములునాయక్ గెలుపు కోరుతూ స్థానిక ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పట్టణంలో పెత్త ఎత్తున ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీగా ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో సాగిన ఈ ర్యాలీలో కార్యకర్తలంతా వైఎస్సార్ సీపీ జెండాలు పట్టుకుని హోరెత్తించారు. హైవేలో ఉన్న దుకాణాలతో పాటు ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి రౌడీలు స్థానిక సంస్థలను దౌర్జన్యంగా తమ వశం చేసుకుంటున్నారని, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్ కేంద్రాల వద్దకు కూడా రాకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని లాఠీచార్జీలు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేయించి బయటకు రాకుండా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో దమనకాండ సృష్టిస్తున్నారని, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో వారు గెలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో దమనకాడ విజృంభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి కుట్రలను తిప్పికొట్టేందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. తమ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మీబాయిని గెలిపించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో మిరపకాయ బజ్జీలు వేస్తూ.. దుస్తులు ఇసీ్త్ర చేస్తూ ప్రజలను ఎమ్మెల్యే ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, మాజీ ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, వైస్ ఎంపీపీ ఎం.ఆదిశేషు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కందూరి కాశీవిశ్వనాథ్, ఉపాధ్యక్షుడు దోగిపర్తి సంతోష్‌కుమార్, ఆర్యవైశ్య సంఘ నాయకులు సూరె వెంకట ప్రసాద్, ఐ.వి.సుబ్బారావు, పబ్బిశెట్టి శ్రీనివాసులు, ఇమ్మడిశెట్టి వెంకట సత్యనారాయణ, కందూరి గురుప్రసాద్, గోళ్ల కృష్ణారావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఓబులరెడ్డి, సయ్యద్ సాబీర్ బాషా, వై.వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, ఎం.కాశింబేగ్, మహమ్మద్ కాశిం, షేక్ కాశీంపీర, మునాఫ్, షేక్ వలి, ఆర్.అరుణాబాయి, సురేష్ నాయక్, డి.సుబ్బారెడ్డి, ఒంగోలు సుబ్బారెడ్డి, సూరె శ్రీనివాసులు, కె.సత్యనారాయణ చౌదరి, యక్కలి రాంబాబు పాల్గొన్నారు.
స్థానిక సంస్థలు కూడా పచ్చనేతల వశమైతే దమనకాండే
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి
వై.పాలెంలో పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి గెలుపు కోరుతూ ప్రచారం చేసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
రెపరెపలాడిన వైఎస్సార్ సీపీ జెండాలు


