కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించం

Nov 2 2026 2:35 AM | Updated on Nov 2 2026 2:35 AM

మార్కాపురం రూరల్‌: వైఎస్సార్‌ సీపీ మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్‌ సలీంను పోలీసులు అదుపులోనికి తీసుకోవడంపై మాజీ ఎమ్మెల్యే, పార్టీ మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సలీంను ఏ కారణంతో పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సలీంను అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న అన్నా రాంబాబు వెంటనే మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సలీంను వెంటనే విడుదల చేయాలని పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్య విలువలు, చట్టాన్ని గౌరవించాలని హితవు పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది చేదని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఏకపక్షంగా మా పార్టీ నాయకులనే అదుపులోనికి తీసుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సలీం తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నా రాంబాబు డిమాండ్‌ చేశారు. రాజకీయ కక్షలకు లేదా ఒత్తిళ్లకు తావు లేకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాజకీయాల్లో ప్రజల తీర్పే అంతిమమని, అధికారులు మారుతూ ఉంటారని పేర్కొన్నారు. అధికారాన్ని ప్రజాసేవకు ఉపయోగించాలే తప్ప ప్రత్యర్థులను ఇబ్బందులు గురిచేసేందుకు ఉపయోగించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలీసు యాంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు చట్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ అన్ని పార్టీలకు సమాన న్యాయం చేయాలని సూచించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ప్రజల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి పోలింగ్‌ సందర్భంగా జరిగిన పరిణామాలను వివరించారు.

వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ సలీం

అరెస్టుపై అన్నా రాంబాబు ఆగ్రహం

తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోండి

ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేస్తే ఊరుకోం

అధికారం శాశ్వతం కాదన్న విషయం

గుర్తించుకోండి

ఎన్నికల్లో అవకతవకలపై కలెక్టర్‌కు

వివరించిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement