ఇంతకు ఇంత అనుభవిస్తారు.. ఖబడ్దార్‌.. | - | Sakshi
Sakshi News home page

ఇంతకు ఇంత అనుభవిస్తారు.. ఖబడ్దార్‌..

Nov 2 2026 2:35 AM | Updated on Nov 2 2026 2:35 AM

ఒంగోలు టౌన్‌: ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, ఏజెంట్లు, డివిజన్‌ అధ్యక్షులు, నాయకులను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని, ఆ మాత్రం దానికి ఎన్నికలు నిర్వహించడం దేనికని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ప్రశ్నించారు. నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ఆదివారం వైఎస్సార్‌ సీపీకి చెందిన పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారని తెలిసిన చుండూరి రవి, మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌, నగర అధ్యక్షుడు కటారి శంకర్‌ తదితరులు తాలుకా పోలీసుస్టేషన్‌కు వచ్చారు. పోలీసుస్టేషన్‌లో ఉన్న పార్టీ శ్రేణులను చూసిన ఆయన పోలీసుల తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ పరిధిలోని ప్రతి డివిజన్‌ నుంచి వైఎస్సార్‌ సీపీకి చెందిన ముఖ్య నాయకులందరినీ తాలుకా సీఐ తీసుకొచ్చారని, ఇది దారుణమన్నారు. తాలుకా పోలీసుస్టేషన్‌ నిండా వైఎస్సార్‌ సీపీ నాయకులే ఉన్నారని, స్టేషన్‌ సరిపోక రద్దీగా ఉందని తెలిపారు. ఇలా అరెస్టులతో ఎన్నికలు చేయడం సిగ్గుచేటని, ఇది ఎలక్షన్‌ ఎలా అవుతుందని నిలదీశారు. ఇంతమాత్రం దానికి ఎన్నికలు పెట్టడం ఎందుకు , ఈ రకంగా చేయడమెందుకని చెప్పారు. ఎలాంటి నేర చరిత్ర లేని వ్యక్తి కుప్పం ప్రసాద్‌ను మేయర్‌గా పోటీకి పెట్టామని తెలిపారు. ఎక్కడా ఎన్నికల నిబంధనలకు విఘాతం కలిగించలేదన్నారు. చెరుకుంపాలెం నుంచి కృష్టారెడ్డి అనే పెద్దాయనపై అక్రమ కేసు పెట్టి తీసుకొచ్చారని, గుండె జబ్బుతో బాధపడుతున్న రాములును తీసుకొచ్చారని, 60వ డివిజన్‌ నుంచి ఆరుగురిని పట్టుకొచ్చారని తెలిపారు. దీనికి మూల్యం చెల్లించే రోజు వస్తుందని పోలీసులు, ఎమ్మెల్యేని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ఆయనతో పాటుగా పార్టీ నాయకులు ఉన్నారు.

వైఎస్సార్‌ సీపీ ఒంగోలు ఇన్‌చార్జి చుండూరి

రవిబాబు హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement