ఎంపీ సార్‌ ఇదేం పని..? | - | Sakshi
Sakshi News home page

ఎంపీ సార్‌ ఇదేం పని..?

Nov 2 2026 2:35 AM | Updated on Nov 2 2026 2:35 AM

సాక్షిటాస్క్‌ఫోర్స్‌: ఒంగోలు రామనగర్‌ 2వ లైన్‌లోని మున్సిపల్‌ హై స్కూల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తన కుటుంబం పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో చేరుకున్నారు. అదే సమయంలో టీడీపీ మేయర్‌ అభ్యర్థి నల్లమల్లి శ్రీ శిల్ప భర్త నల్లమల్లి బాలు వర్గంతో కలిసి ఓటు వేసేందుకు వచ్చారు. పోలింగ్‌ కేంద్రం గేటు వద్ద, లోపల కార్యకర్తలు గుంపులుగా చేరడంతో సామాన్య ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాన్య ప్రజలను 50 మీటర్ల దూరంలోనే నిలిపివేస్తున్న పోలీసులు, ప్రజాప్రతినిధుల వెంట వచ్చిన పెద్ద ఎత్తున కార్యకర్తలను పట్టించుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో ఎంపీ అయినా, సామాన్య ఓటరైనా ఎన్నికల సంఘం నిబంధనలు అందరికీ సమానమే. కానీ నిబంధనలకు విరుద్ధంగా గుంపుగా కార్యకర్తలతో చేరుకోవడంపై పట్ల ఓటర్లు సైతం అసహనం వ్యక్తం చేశారు.

ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి గుంపులుగా చేరుకున్న వైనం

ఎన్నికల నిబంధనలకు పట్టించుకోవడంపై సర్వత్రా విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement