సేవ చేసేందుకే చైర్మన్‌ బరిలో.. | - | Sakshi
Sakshi News home page

సేవ చేసేందుకే చైర్మన్‌ బరిలో..

Nov 1 2026 7:31 AM | Updated on Nov 1 2026 7:31 AM

గిద్దలూరు రూరల్‌:

‘వైద్యుడిగా గిద్దలూరు పట్టణ ప్రజలకు గత 29 సంవత్సరాలుగా సేవలందిస్తున్నా. ఆరోగ్యం బాగలేక నా వద్దకు వచ్చిన వారితో పాటు తెలిసిన వారంతా గిద్దలూరు పట్టణంలోని సమస్యలు తెలియజేస్తూ ఉంటారు. పలు సందర్భాల్లో వారి ఆవేదన కూడా వెలిబుచ్చేవారు. అటువంటివి విన్న తర్వాత మున్సిపల్‌ చైర్మన్‌ అయితే ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారికి అవసరమైన అన్ని వసతులు కల్పించవచ్చని అనిపించింది. అందువలన మొట్టమొదటిసారి చైర్మన్‌ కావాలని అనుకున్నాను. ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుందని మాత్రమే వైఎస్సార్‌ సీపీ గిద్దలూరు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను’.. అని డాక్టర్‌ భూమా నరసింహారెడ్డి తెలిపారు. పట్టణ ప్రజలకు మరింత చేరువై సేవలందించే లక్ష్యంతో అందరినీ కలుపుకుని ముందుకు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. శనివారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

భూమా : ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా బాగుండాలంటే ముందుగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. కానీ, ప్రస్తుతం గిద్దలూరులో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వలన అధిక సంఖ్యలో ప్రజలకు వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తాం. పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న టౌన్‌ ప్లానింగ్‌ విధానంలో మార్పులు తీసుకొస్తాం. ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం. టౌన్‌ ప్లానింగ్‌ శాఖ నిర్లక్ష్యం కారణంగా పట్టణంలోని వీధుల్లో ట్రాఫిక్‌ సమస్యతో ప్రతిరోజూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించేందుకు రోడ్డును ఆక్రమించి ఉన్న కట్టడాలను తొలగిస్తాం. తద్వారా ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చూస్తాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి వ్యక్తి ఆనందంగా గడపాలే చర్యలు తీసుకుంటాం. అందుకోసం పార్కులను అభివృద్ధి చేసి వాటిలో వ్యాయామ పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తాం. పట్టణంలోని కాశీనాయనకుంట ఆవరణ చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌తో పాటు ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తాం. కుంటలోని మురికి నీటిని శుద్ధి చేసే ప్రక్రియ చేపడతామం. పట్టణంలోని గృహాల్లో వృధా నీరంతా మురికి కాలువల ద్వారా కాశిరెడ్డి కుంటలోకి వచ్చేలా చేశారు. పూర్వం తాగునీటికి ఉపయోగించే కాశిరెడ్డి కుంట నేడు పెద్ద మురికి కుంటగా మారిపోయింది. కాశిరెడ్డి కుంట అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతాం. వాకింగ్‌ ట్రాక్‌ లేకపోవడం వలన పట్టణ ప్రజలు రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో, జాతీయ రహదారుల వెంట వాకింగ్‌ చేస్తున్నారు. రోడ్ల వెంట వాకింగ్‌ చేయడం వల్ల వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో రైలు వచ్చే సమయంలో వాకింగ్‌ చేయడం చాలా కష్టతరంగా మారుతూ వాకింగ్‌ చేసే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని లక్ష్మీనరసింహస్వామి ఘాట్‌రోడ్డు పార్కు పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా ఉంది. పొట్టిశ్రీరాముల సెంటర్‌ వద్ద గల చిల్డ్రన్‌ పార్కులో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్కును అపరిశుభ్రంగా తయారు చేశారు. ఆయా పార్కులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తాం. పేద ప్రజానికానికి అహర్నిశలు అందుబాటులో ఉంటూ వారికి పూర్తి స్థాయిలో సేవలందిస్తాం.

భూమా : ఓటరు మహాశయులు ఎంతటి వారినైనా గొప్పస్థాయికి ఎదిగేలా చేయగలరు. అలాగే వారిని పాతాళానికి తొక్కిపడేసి చరిత్రహీనులుగా మార్చగల విజ్ఞత శక్తి కూడా ఉన్నవారు. వారి పట్ల నిర్లక్ష్యంగా వహించిన నాయకుడికి సరైన సమయంలో బుద్ధి చెప్పగల సమర్థులు ఓటర్లు. సామాన్య ప్రజల దృక్పథం, రాజకీయ నాయకుల ఆచరణ విధానంలో మంచి పాలన అందించాలనే ఉంటుంది. డబ్బుకు, ఇతర ప్రలోభాలకు ఓటరు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కు ఉపయోగించుకోవాలి.

భూమా : ప్రజాస్వామ్యాన్ని అందరూ గౌరవించాలి. గొప్ప పరిపాలన వ్యవస్థను తీసుకురావాలి. రాజరిక పాలన, నియంత పాలన వంటి వాటికంటే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడం ఎంతో గొప్పవిషయం. ప్రజలచే ఎన్నుకోబడి ప్రజలను పాలించే మహాత్తర విధానం ప్రజాస్వామ్యవిధానం. అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అపహాస్యం కాకుండా చూడాలి. ప్రజాస్వామాన్యి పరిరక్షించుకునే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ఆచరణ సాధ్యమైన విధానాలను అవలంబిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించడంలో ప్రజాస్వామ్య విధానం ఎంతగానో దోహదపడుతుంది.

భూమా : అదృష్టవశాత్తూ ఎన్నికలు సజావుగా జరిగి భగవంతుడి దయతో గిద్దలూరు పట్టణ ప్రజల ఆశీస్సులతో చైర్మన్‌ అయితే మాత్రం పూర్తి స్థాయిలో చైర్మన్‌గానే కొనసాగుతా. ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా. గిద్దలూరు చైర్మన్‌గా అవడం అంటే మరో జన్మ ఎత్తినట్లు భావించి పట్టణ ప్రజలకు రుణపడి ఉంటా. అలాగని వైద్య వృత్తిని పూర్తిగా వదలకుండా వైద్య బృందంలో ఒకరిగా పాల్గొనేందుకు ప్రయత్నిస్తా.

భూమా : రాజకీయాల్లోకి రావడానికి దివంగత ఎన్టీఆర్‌తో పాటు దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ స్ఫూర్తి. వారిద్దరూ నా హృదయంలో ఎప్పటికీ చిరస్మరణీయులు. వారే నా రాజకీయ ప్రవేశానికి ప్రధాన కారకులు.

వైఎస్సార్‌ సీపీ గిద్దలూరు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ భూమా నరసింహారెడ్డి

సాక్షి : ప్రజాస్వామ్యంపై

మీ అభిప్రాయం ఏంటి..?

సాక్షి : చైర్మన్‌ అయ్యాక పట్టణంలో

ఎలాంటి పనులు చేపడతారు.?

సాక్షి : చైర్మన్‌ అయ్యాక వైద్య వృత్తిలో

కొనసాగుతారా.?

సాక్షి : రాజకీయాల్లోకి రావడానికి

స్ఫూర్తి ఎవరు..?

సాక్షి : ఓటర్ల నుంచి ఏం

కోరుకుంటున్నారు.?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement