● రూ.8 లక్షల ఆస్తి నష్టం
అద్దంకి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమై గృహోపకరణాలు కాలిపోయిన సంఘటన మండలంలోని శింగరకొండపాలెం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పేరం వెంకారెడ్డి ఇంట్లో పిల్లలు టీవీ చూస్తున్నారు. మిగిలిన వాళ్లు పనుల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఫ్రిజ్ వెనుక వైపు నుంచి సౌండ్ వచ్చి పొగలు, మంటలు వ్యాపించాయి. గమనించిన పిల్లలు, పెద్దలు బయటకు పరుగులు తీశారు. కాసేపట్లోనే ఇల్లంతా మంటలు వ్యాపించి ఇంట్లోని ఫ్రిజ్, టీవీ, గ్యాస్ పొయ్యి, నగలు, డబ్బు మంటల్లో కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో రూ.8 లక్షల విలువైన వస్తువులు, నగదు, నగలు కాలిపోయాయని యజమాని వాపోయాడు.


