సామాన్యుడు బతకలేని పరిస్థితి | - | Sakshi
Sakshi News home page

సామాన్యుడు బతకలేని పరిస్థితి

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

కూటమి పాలనలో..

చీమకుర్తి రూరల్‌: కూటమి ప్రభుత్వ పాలనలో సామా న్యుడు బతకలేని పరిస్థితి నెలకొందని, బియ్యం ధరల నుంచి నిత్యావసర సరుకుల ధరల వరకూ భారీగా పెరిగి పేదలు మూడు పూటలా అన్నం తినలేని దుస్థితి ఏర్పడిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధి పనులు పూర్తిచేసి సుపరిపాలన అందించారని గుర్తుచేశారు. ప్రజలంతా గమనించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యురాలు బూచేపల్లి వెంకాయమ్మ, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జునతో కలిసి చీమకుర్తి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో సోమవారం కోలాహలంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ చీమకుర్తి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి మేడగం శ్రీదేవి, 28 వార్డుల కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బూచేపల్లి, మేరుగు, మేడగం శ్రీదేవితో పాటు 21వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి చల్లా శ్రావణి, 22వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి నల్లబోలు మోహన్‌ దిన్నేపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు వారికి హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పాలనపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తోందన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నవరత్నాలలో భాగంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించామని, ఎన్నికల్లో చెప్పిన వాటితో పాటు చెప్పనవి కూడా అమలు చేశామని వివరించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని, మంచి పాలన అందిస్తామని ఓటర్లను కోరారు.

చీమకుర్తిలో వైఎస్సార్‌ సీపీ గెలుపు ఖాయం : మేరుగు నాగార్జున

ప్రజలంతా వైఎస్సార్‌ సీపీ వైపు ఉన్నారని, ప్రజల మద్దతుతో చీమకుర్తి మున్సిపాలిటీలో చైర్‌పర్సన్‌ అభ్యర్థి మేడగం శ్రీదేవితో పాటు 28 వార్డుల కౌన్సిలర్‌ అభ్యర్థుల గెలుపు ఖాయమని మేరుగు నాగార్జున అ న్నారు. వైఎస్సార్‌ సీపీ పాలనలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు గుర్తు చేస్తున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థి తుల్లోనూ రాష్ట్ర ప్రజలను జగనన్న ఏ విధంగా ఆదుకున్నారో వివరించారు. కూటమి పాలనలో రెండున్నరేళ్లు గా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తెల్లమేకల గాంధీ, మాజీ కౌన్సిలర్లు కాజా మొద్దీన్‌, కాశయ్య, సోమా శేషాద్రి, కన్నెబోయిన సురేష్‌, ఆమదాలపల్లి రామబ్రహ్మం, నాయకులు సూది శ్రీను, మొగిలిచెట్టి వెంకటేశ్వర్లు, మంచ హరికృష్ణ, పాలడుగు సుబ్బు, గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, గోపారపు ప్రసాదరెడ్డి, మేడగం హర్షిత్‌, రాజశేఖర్‌రెడ్డి, జంషీర్‌, బడే దశరథరామిరెడ్డి, కిష్టపాటి శ్రీనివాసరెడ్డి,శ్రీను,కార్యకర్తలు పాల్గొన్నారు.

బియ్యం మొదలు.. నిత్యావసరాల ధరలన్నీ భారీగా పెరిగాయి

మూడు పూటలా అన్నం తినేందుకు కూడా పేదలు అవస్థపడుతున్నారు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో

సుపరిపాలన అందించాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించండి

మోసపూరిత చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పండి

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పిలుపు

బూచేపల్లి వెంకాయమ్మ, మేరుగు నాగార్జున, అభ్యర్థులతో కలిసి చీమకుర్తి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement