ఎస్‌జీపీఐ అథ్లెటిక్స్‌లో గణపవరం విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీపీఐ అథ్లెటిక్స్‌లో గణపవరం విద్యార్థుల ప్రతిభ

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

● రాష్ట్ర స్థాయికి 50 మంది విద్యార్థులు ఎంపిక

యర్రగొండపాలెం: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీపీఐ) ఆధ్వర్యంలో మార్కాపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపికలో గణపవరం ఏపీఆర్‌ఎస్‌ విద్యార్థులు ప్రభజనం సృష్టించారు. ఈ గురుకుల పాఠశాల నుంచి 50 మందికి పైగా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ గంటా మోహన్‌రెడ్డి, పీఈటీ వై.డేవిడ్‌రాజు సోమవారం తెలిపారు. అండర్‌ 14 విభాగంలో పి.హరీశ్వర్‌రెడ్డి 600, 400 మీటర్ల రన్నింగ్‌లో ప్రథమ స్థానం, బి.శర్మ హైజంప్‌, టి.బాలాజి షాట్‌పుట్‌లో ప్రథమ స్థానం, జి.అమర్‌ 80 మీటర్ల హర్డిల్‌లో, వి.రామకృష్ణ లాంగ్‌ జంప్‌లో ద్వితీయ స్థానం సాధించారు. అండర్‌ 17 విభాగంలో వి.శివప్రసాద్‌ 800 మీటర్ల రన్నింగ్‌, 400 మీటర్ల హార్డిల్‌, 3 కేఎం రన్నింగ్‌లలో, 4్ఠ400 మీటర్ల రిలేలో ప్రథమ స్థానం, టి.సాయిబాలాజీ 100, 200 మీటర్ల రన్నింగ్‌, లాంగ్‌ జంప్‌లలో ద్వితీయ స్థానం, బి.కిషోర్‌ నాయక్‌ హైజంప్‌, ట్రిపుల్‌ జంప్‌లలో ప్రథమ స్ధానం, ఎం.పవన్‌కుమార్‌రెడ్డి జావలిన్‌ త్రోలో ప్రథమ స్థానం, బి.రోహిత్‌ కుమార్‌ 100 మీటర్ల హార్డిల్స్‌లో ప్రథమ స్థానం, వై.వీర వెంకటేశ్వర్లు 100 మీటర్ల హార్డిల్స్‌లో ద్వితీయ, బి.వి.యస్‌.మణికంఠ నాయుడు 5కేఎం రేస్‌ వాక్‌లో ప్రథమ, డి.శివాజి 5 కేఎం రేస్‌వాక్‌లో ద్వితీయ, ఐ.వివేక్‌ జావలిన్‌ త్రోలో ద్వితీయ, వి.హనుమా మహేష్‌ 400 మీటర్ల రన్నింగ్‌లో ద్వితీయ, వి.మహేష్‌ డిస్కస్‌ త్రోలో ప్రథమ స్థానం సాధించారు. అండర్‌ 19 విభాగంలో 400 మీటర్ల రన్నింగ్‌లో ప్రథమ, యం.శివచరణ్‌ ద్వితీయ, హార్డిల్‌లో ప్రథమ, సీహెచ్‌ వెంకటకోటిరెడ్డి 800 మీటర్ల రన్నింగ్‌లో ప్రథమ, 110 మీటర్ల హార్డిల్‌లో ద్వితీయ, కె.యశ్వంత్‌రెడ్డి జావలిన్‌ త్రోలో ప్రథమ, జెడ్‌.డేవిడ్‌ హేమర్‌త్రోలో ప్రథమ, సి.తేజేశ్వర్‌ నాయుడు జావలిన్‌ త్రోలో ద్వితీయ, బి.కార్తికేయ 5 కేఎం రేస్‌వాక్‌లో ప్రథమ, డి.నాసర్‌వలి హైజంప్‌లో ప్రథమ, ఎ.సాయికుమార్‌ 400 మీటర్ల హార్డిల్‌లో ద్వితీయ, అర్‌.అనిల్‌ కుమార్‌ లాంగ్‌జంప్‌లో ద్వితీయ, జె.కార్తిక్‌ క్రాస్‌ కంట్రిలో ప్రథమ, ఎం.ప్రేంచంద్‌ ద్వితీయ స్థానాలు సాధించారు. వీరితో పాటు మరికొంతమంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement