రామాయణం స్ఫూర్తితో విలువలు పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రామాయణం స్ఫూర్తితో విలువలు పెంచుకోవాలి

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

రామాయణం స్ఫూర్తితో విలువలు పెంచుకోవాలి

● ఎస్పీ హర్షవర్థన్‌రాజు పిలుపు

ఒంగోలు టౌన్‌: ప్రతిఒక్కరూ రామాయణం స్ఫూర్తితో కుటుంబ, మానవతా విలువలు పెంపొందించుకోవాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజు పిలుపునిచ్చారు. సోమవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నతమైన ఆదర్శాలను బోధించే రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి.. యుగాలు మారినా స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. స్వార్థ చింతన వీడి సన్మార్గంలో నడవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ (అడ్మిన్‌) యుగంధర్‌బాబు, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, ఆర్‌ఐ సీతారామిరెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement