ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 27 2026 1:56 AM | Updated on Oct 27 2026 1:56 AM

● కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు సిటీ: ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రమైన నగర శివారులోని రైజ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారితో కలిసి సోమవారం కలెక్టర్‌ పరిశీలించారు. కౌంటింగ్‌ కోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇచ్చిన శిక్షణపై ఆరా తీశారు. కౌంటింగ్‌ కోసం టేబుళ్ల ఏర్పాటు, కేటగిరీల వారీగా పేపర్లను వేరుచేసి 25 చొప్పున కట్టలు కట్టడం, ఓటు వేసిన వారి సంఖ్యతో వాటిని సరిపోల్చడం, లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్‌ హాలులో సరిపడినంత వెలుతురు, సీసీ టీవీల ఏర్పాటు, హాల్లోకి అధికారులు, ఏజెంట్లకు వేరువేరుగా ప్రవేశ మార్గాల ఏర్పాటు, తదితర అంశాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల మేరకు ఈ మొత్తం ప్రక్రియ ఉండాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంగణంలో భద్రతాపరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కూడా అధికారులతో కలెక్టర్‌, ఎస్పీ, జేసీ చర్చించారు. కాగా, కందుకూరు, కొండపి నియోజకవర్గాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలను కూడా ఈ కాలేజీ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా వారు పరిశీలించారు. కలెక్టర్‌ వెంట అర్బన్‌ ఎలక్షన్స్‌ నోడల్‌ అధికారి వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి, ఒంగోలు, అద్దంకి, చీమకుర్తి మున్సిపాలిటీల ఆర్వోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement