సోమవారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 26 2026 3:16 AM | Updated on Oct 26 2026 3:16 AM

సోమవారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 – 8లో..

న్యూస్‌రీల్‌

మార్కాపురం మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థులుగా 12 మంది

గిద్దలూరు బరిలో ఐదుగురు చైర్మన్‌ అభ్యర్థులు

చీమకుర్తి చైర్మన్‌ బరిలో ముగ్గురు

అద్దంకి ఎన్నికల బరిలో 74 మంది

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను తప్పించడమే లక్ష్యంగా కుట్ర చిన్న చిన్న కారణాలు చూపి భారీగా అభ్యర్థుల నామినేషన్‌ల తిరస్కరణ ఎందుకు తిరస్కరించారో కూడా సరైన కారణాలు చెప్పకుండా తప్పించుకుంటున్న ఎన్నికల అధికారులు అప్పీల్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు కారణాలు తెలపని కొందరు అధికారులు డ్వాక్రా రుణాలు ఉన్నాయని, కేసులు నమోదయ్యాయంటూ వింత కారణాలతో నామినేషన్‌ల తిరస్కరణ టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే మొత్తం నామినేషన్‌ల పరిశీలన, తిరస్కరణ వ్యవహారం

అప్పీల్‌లోనైనా ఊరట దక్కేనా...

స్థానిక సమరంలో అధికార పార్టీ గూండాలు పోలీసులతో కలిసి అడుగడుగునా కల్పించిన కుట్రలు, ఆటంకాలను దాటుకుని నామినేషన్లు వేసిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను పోటీలో లేకుండా చేసేందుకు వెన్నుపోటు పార్టీ మరో కుట్రకు పాల్పడింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను తప్పించడమే లక్ష్యంగా అధికారులతో కుమ్మకై ్క చిన్నచిన్న కారణాలతో నామినేషన్లను తిరస్కరించేలా చేశారు. ప్రజల ఓట్లతో గెలవలేమని తెలిసిన పచ్చనేతలు అడ్డదారిలో పదవులు చేజిక్కించుకునేందుకు గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్లను పెద్ద ఎత్తున తిరస్కరించడంపై ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

గెలవలేక

తిరస్కరణాయుధం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

తెలుగుదేశం పార్టీ గూండాలను, పోలీసుల అడ్డంకులను దాటుకుని ప్రాణాలకు తెగించి నామినేషన్‌లు వేశామని సంబరపడే లోపే తిరస్కరణనే ఆయుధంతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఎన్నికల బరి నుంచి బయటకు పంపుతున్నారు. నామినేషన్‌లు వేసినప్పుడు, పరిశీలన సమయంలో అంతా బాగుందని సర్టిఫికేట్‌ ఇస్తున్న ఎన్నికల అధికారులు ఇంతలోనే మీ నామినేషన్‌ చెల్లదని చెప్తూ కాగితాన్ని చేతుల్లో పెడుతున్నారు. డ్వాక్రా రుణాలు ఉన్నాయి, మీపై పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయనే సిల్లీ కారణాలతో నామినేషన్‌లను అర్ధరాత్రి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అదీ కూడా ఏ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశికంలో వైఎస్సార్‌ సీపీ గెలిచే అవకాశం ఉంటుందో ఆ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని నామినేషన్‌ల తిరస్కరణ పేరుతో పోటీలో లేకుండా చేశారు. జిల్లా వ్యాప్తంగా కందుకూరు, కనిగిరి, కొండపి, గిద్దలూరు, అద్దంకి వంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నామినేషన్‌లను తిరస్కరించారు. ఈ దారుణంపై వైఎస్సార్‌ సీపీ నాయకులు, ప్రజాస్వామికవాదులు మండిపడుతున్నారు.

చిన్న కారణాలతో చిల్లర చేష్టలు:

టీడీపీ నాయకులతో పూర్తిగా కుమ్మకై ్కన ఎన్నికల అధికారులు ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌లో సైతం లేని చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్‌లను ఇష్టారీతిన తిరస్కరించారు. నామినేషన్‌ల తిరస్కరణకు చూపిన కారణాలను చూస్తే నవ్వురాకమానదు. అసలు డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులేకాని అభ్యర్థులకు డ్వాక్రా రుణాలు ఉన్నాయని, పత్రాల్లో సంతకాలు లేవని, అభ్యర్థికి కూడా తెలియకుండా పోలీస్‌స్టేషన్‌లో కేసు ఉందని వంటి సిల్లీ కారణాలు చెప్పి నామినేషన్‌లను తిరస్కరించారు. అదీ కూడా ఏ స్థానంలోనైతే వైఎస్సార్‌ సీపీ కచ్చితంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నారో ఆ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారు. ఉదాహరణకు కందుకూరు మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఆరు నుంచి 7 ఎంపీటీసీ స్థానాల వరకు వైఎస్సార్‌ సీపీ కచ్చితంగా తెలుస్తుందని అంచనా. దీంతో ఎంపీపీ సీటును కూడా వైఎస్సార్‌ సీపీ కై వసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైఎస్సార్‌ సీపీ కచ్చితంగా గెలిచే పాలూరు–దొండపాడు, మాచవరం–2 ఎంపీటీసీ స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల నామినేషన్‌లను తిరస్కరించారు. దీంతో ఆ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీ అనేది లేకుండా ఎంపీటీసీలుగా ఎన్నికవుతారు. అలాగే వలేటివారిపాలెం మండలంలో చుండి, కలవళ్ల, పోకూరు అభ్యర్థుల నామినేషన్‌లను తిరస్కరించారు. ఇలా కందుకూరు నియోజకవర్గంలోనే వైఎస్సార్‌ సీపీ కచ్చితంగా గెలిచే 7 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల నామినేషన్‌లను తిరస్కరించారు. అలాగే కనిగిరి నియోజకవర్గంలోని 11 మంది అభ్యర్థులకు సంబంధించి 13 నామినేషన్‌లు, కొండపిలో 22 మంది అభ్యర్థుల 26 నామినేషన్‌లను తిరస్కరించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా భారీగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

● కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిగా సింహాద్రి నారాయణమ్మ ఈ నెల 23న నామినేషన్‌ దాఖలు చేసింది. ఈనెలలో డ్వాక్రా గ్రూపులో లక్ష రూపాయల లోను పెట్టుకుంది. ఈ నెల 17న ఆమె అకౌంట్‌లో రుణం డబ్బులు జమకావడంతో అవి తెలియక ఫారంలో రాయలేదని, అది నామినేషన్‌ ఫారంలో చూపించలేదని ఎన్నికల స్పెషల్‌ అధికారి టి.నారాయణ, ఎంపీడీవో శ్రీకృష్ణ తిరస్కరించారు.

● కొత్తపట్నం మండలం అల్లూరు–2 ఎంపీటీసీ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా బూర్ల పద్మావతి తన కుమారుడికి పీడీఎస్‌ బ్యాంక్‌లో రూ.10 వేలు అప్పు ఉందని అది నామినేషన్‌ ఫారాల్లో రాయలేదని తిరస్కరించారు.

మార్కాపురం టౌన్‌: మార్కాపురం పురపాలక సంఘంలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థుల తుదిజాబితాను సహాయ ఎన్నికల అధికారి, కమిషనర్‌ నారాయణరావు ఆదివారం విడుదల చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌ సీపీ తరఫున డాక్టర్‌ చప్పల్లి కనకదుర్గ, టీడీపీ తరఫున వక్కలగడ్డ మల్లిఖార్జున్‌, ఇండిపెండెంట్లుగా 8 మంది, కాంగ్రెస్‌–1, బీసీవై–1 బరిలో ఉన్నారు. వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులుగా వైఎస్సార్‌ సీపీ తరఫున 37 మందితోపాటు వివిధ పార్టీలకు చెందిన మొత్తం 125 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు. మార్కాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా చప్పల్లి కనకదుర్గ బరిలో ఉన్నారు.

గిద్దలూరు రూరల్‌: స్థానిక మున్సిపల్‌ ఎన్నికల బరిలో 28 వార్డులకు సంబంధించి ఐదుగురు చైర్మన్‌ అభ్యర్థులు, 86 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు పోటీలో నిలబడనున్నట్లు కమిషనర్‌ ఈవీ రమణబాబు ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మొత్తం 123 మంది కౌన్సిలర్లు నామినేషన్లు వేయగా అందులో 37 మంది వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 17 మంది చైర్మన్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ వేయగా 12 మంది ఉపసంహరించుకోవడంతో ఐదుగురు చైర్మన్‌ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవనున్నారు. అందులో వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థిగా డా.భూమానరసింహారెడ్డి పోటీలో ఉన్నారు.

చీమకుర్తి రూరల్‌: చీమకుర్తి మున్సిపాలిటీలోని 28 వార్డులకు సంబంధించి ఆదివారం రిటర్నింగ్‌ అధికారులు అభ్యర్థులను ఖరారు చేశారు. మొత్తం 67 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్‌ సీపీ నుంచి 28 మంది, టీడీపీ నుంచి 26 మంది, స్వతంత్ర అభ్యర్థులు 10 మంది, జనసేన నుంచి ఇద్దరు ఉన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి మేడగం శ్రీదేవి పోటీ చేస్తున్నారు.

అద్దంకి: మునిసిపల్‌ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల జాబితాను ఆదివారం మున్సిపల్‌ కమిషనర్‌ ప్రకటించారు. ఇప్పటికే మున్సిపాలిటీలోని 1, 6, 32 వార్డులు ఏకగ్రీవం కావడంతో 29 వార్డులకు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌కు ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మునిసిపల్‌ చైర్మన్‌తోపాటు, వార్డు అభ్యర్థులతో కలుపుకుని మొత్తం 74 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు కమిషనర్‌ వెల్లడించారు.

అంతుపట్టని కారణాలను సాకుగా చూపిస్తూ...

ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను పోటీలో లేకుండా చేసేందుకు అధికార పార్టీ చేయని కుట్ర అంటూ లేదు. ప్రధానంగా పోలీసులను అడ్డుపెట్టుకుని నామినేషన్‌లు వేయకుండా చేయాల్సిన దారుణాలన్నీ చేశారు. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడడం, నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించివేయడం వంటి అరాచకాలు ఎన్నో చేశారు. అయినా సరే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు మొండిగా పోరాడి అనేక చోట్ల నామినేషన్‌లు దాఖలు చేశారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు పోటీలో ఉంటే తమకు గెలుపు కష్టమనే భావనకు వచ్చిన అధికార పార్టీ నేతలు వారిని ఎలాగైనా పోటీ నుంచి తప్పించేందుకు అధికారులను అడ్డుపెట్టుకుని సరికొత్త కుట్రలకు పదును పెట్టారు. దీనిలో భాగంగా శనివారం జరిగిన అభ్యర్థుల నామినేషన్‌ పరిశీలనలో పెద్ద ఎత్తున వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నామినేషన్‌లను తిరస్కరిస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. నామినేషన్‌లను ఎందుకు తిరస్కరిస్తున్నారో కూడా అభ్యర్థులకు సరైన కారణం చెప్పకుండా తిరస్కరణ పత్రాన్ని చేతిలో పెట్టారు. అధికారులు చెప్పిన కారణాలు చూసి నోరెళ్లబెట్టడం తప్పా ఏమీ చేయలేని పరిస్థితి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులది. ఇంతటి దారుణమైన కుట్రలను గతంలో ఎన్నడూ చూడలేదని, ఎందుకు తిరస్కరించారో కూడా సమాధానం చెప్పేవారు కరువయ్యారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరస్కరించిన అభ్యర్థులు తరువాత ఉన్నతాధికారుల వద్ద అప్పీల్‌కు వెళ్లినా ఏ ప్రయోజనం ఉండడం లేదు. దీంతో అనేక మంది అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

తమకు సహేతుకమైన కారణాలు చెప్పకుండా నామినేషన్‌లను తిరస్కరించడంపై అభ్యర్థులు ఎన్నికల అప్పీల్‌ అధికారి వద్ద ఆదివారం మొరపెట్టుకున్నారు. ఎన్నికల నిబంధనల్లో లేని కారణాలను సాకుగా చూపిస్తూ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు కుట్రపూరితంగా నామినేషన్‌లు తిరస్కరించడంపై తమ వాదనను చెప్పుకున్నారు. అభ్యర్థుల వాదనలను నమోదు చేసుకున్న అప్పీలేట్‌ అధికారులు వారి నామినేషన్‌లను తిరిగి ఆమోదిస్తారా లేదా అనే అంశంపై ఆదివారం వరకు స్పష్టత లేదు. కనీసం ఇక్కడైనా ఉన్నతాధికారులు తమ వాదనలను పరిగణలోకి తీసుకుని తమ నామినేషన్‌లను ఆమోదించాలంటూ అభ్యర్థులు వేడుకుంటున్నారు. లేదంటూ ఇక కోర్టులను ఆశ్రయించడం తప్పా మరో మార్గం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement