టీడీపీ నాయకులతో కుమ్మకై ్కన పోలీసులు ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు ఉండి కూడా కనీసం ఒక్కరి చేత కూడా నామినేషన్ వేయించలేకపోవడం సిగ్గుచేటు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నది పోలీసులే వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికలు సజావుగా జరిగితే ఓడిపోతామన్న భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా పోలీసుల ద్వారా అడ్డుకున్నారని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలుసుకున్న చంద్రబాబు స్థానిక ఎన్నికల్లో దొడ్డిదారిని గెలవడానికి కూట్రపూరితంగా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని విమర్శిఽంచారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి పాలనకు రెఫరెండంగా


