ఒంగోలు నగర అభివృద్ధి కుప్పం ప్రసాద్తోనే సాధ్యమని బూచేపల్లి స్పష్టం చేశారు. ఒంగోలు కార్పొరేషన్ సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న కుప్పం ప్రసాద్ వంటి నాయకుడి అవసరం ఎంతో ఉందన్నారు. నగరంలోని శివారు ప్రాంతాల్లో ఉన్న మంచినీటి సమస్య, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచాలన్న ఆలోచన ఉన్న నాయకుడు మన పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని వివరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన విద్యావంతుడు, నిబద్ధత కలిగిన నాయకుడిగా పేరున్న ప్రసాద్ ను ఎంపిక చేయడం పట్ల అన్నీ వర్గాల ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమవుతోందని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యురాలు బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవిబాబు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కుప్పం ప్రసాద్, కసుకుర్తి ఆదెన్న, వై వెంకటేశ్వరరావు, కేవీ రామణారెడ్డి, కఠారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.


