ప్రాదేశిక ఎన్నికలకు రెండు కౌంటింగ్‌ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక ఎన్నికలకు రెండు కౌంటింగ్‌ కేంద్రాలు

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

ప్రాదేశిక ఎన్నికలకు రెండు కౌంటింగ్‌ కేంద్రాలు ● పరిశీలించిన కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్‌ రాజు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్‌

● పరిశీలించిన కలెక్టర్‌ రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్‌ రాజు

ఒంగోలు టౌన్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లా కేంద్రమైన ఒంగోలులో రెండు కౌంటింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ పి.రాజాబాబు నిర్ణయించారు. నగరంలోని పేస్‌, క్విజ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సోమవారం ఎస్పీ హర్షవర్ధన్‌ రాజుతో కలిసి పేస్‌, క్విస్‌ కాలేజీలను పరిశీలించారు. ఈ కేంద్రాల్లోనే స్ట్రాంగ్‌ రూంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన కేటాయింపు, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ పరిశీలనలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకట కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఒంగోలు సబర్బన్‌: కలెక్టర్‌ పీ రాజాబాబు కలెక్టర్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని, మీడియా సెంటర్లను సోమవారం పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి ఎప్పటికప్పుడు విషయాలు సేకరించి నమోదు చేయాలన్నారు. రిజిస్టర్లను పరిశీలించి నమోదు ప్రక్రియను సక్రమంగా చేయాలని ఆయన సూచించారు. అప్రమత్తతో విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. మీడియా సెంటర్‌లో అన్ని వసతులు ఉండేటట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement