పచ్చ స్క్రిప్ట్‌.. పోలీసు ఓవరాక్షన్‌.. | - | Sakshi
Sakshi News home page

పచ్చ స్క్రిప్ట్‌.. పోలీసు ఓవరాక్షన్‌..

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

మొదటి పేజీ తరువాయి

9వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న చర్చిల్‌ గిఫ్ట్‌ అనే అభ్యర్థిని విత్‌డ్రా చేసుకోవాలంటూ సోమవారం ఒక సీఐ, కొందరు పోలీసులతో కలిసి ఇంటికి వెళ్లి అతడి తల్లి తేళ్ల సుజన్‌ కుమారిని బెదిరింపులకు గురి చేసినట్లు సమాచారం. ఈ మేరకు చర్చిల్‌ తల్లి రోదిస్తూ మీడియాతో మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అంతేకాకుండా మరో డివిజన్‌ అభ్యర్థిని కూడా బెదిరించినట్లు తెలిసింది. మొత్తం మీద ఐదుగురు అభ్యర్థులతో విత్‌డ్రా చేయించేందుకు టీడీపీ పెద్దలు కుట్రలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కనిగిరిలో కొనసాగుతున్న అరాచకపర్వం

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కనిగిరిలో మూడు రోజులుగా పచ్చమూకలు పోలీసులు రెచ్చిపోతున్నారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు తీవ్ర దాష్టీకానికి తెగబడుతున్నారు. సోమవారం జరిగిన నామినేషన్‌ పత్రాల పరిశీలన ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీసింది. నామినేషన్‌ వేసిన అభ్యర్థులను పరిశీలనకు కూడా లోపలికి వెళ్లనీయకుండా, సుమారు 200 మంది పచ్చగూండాలు కర్రలు, రాళ్లతో నామినేషన్‌ కేంద్రం వద్దే బైఠాయించి అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేశారు. వైఎస్సార్‌ సీపీ టెంట్‌లను కూల్చివేశారు. నామినేషన్‌ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కాగానే ముందుగా వెళ్లిన అభ్యర్థుల చేతుల్లోని పత్రాలను టీడీపీ గూండాలు, మహిళలను అడ్డంపెట్టుకుని చించేశారు. టీడీపీ గూండాలను అడ్డుకుని నామినేషన్‌లు వేసిన అభ్యర్థులను లోపలికి పంపించే ప్రయత్నం కూడా అక్కడ ఉన్న పోలీసులు చేయలేదు. అంటే పోలీసులు అధికార పార్టీకి ఏవిధంగా కొమ్ముకాస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ దద్దాల నారాయణయాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి పులి శాంతిరెడ్డి అభ్యర్థులకు కనీస రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా పట్టించుకోలేదు. అభ్యర్థులను లోపలికి తీసుకెళ్లే పని తమది కాదంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పచ్చగూండాలు, పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా అక్కడే బైఠాయించిన దద్దాల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అక్కడే ఉన్న సీఐ, ఎస్సైలు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తూ భయాందోళనకు గురిచేశారు. నామినేషన్‌ల పత్రాల పరిశీలన ప్రక్రియ ముగిసే వరకు ఈ నిరసన కొనసాగింది. వైఎస్సార్‌ సీపీ శ్రేణులను 100 మీటర్ల దూరంలో నిలిపేసిన పోలీసులు, అధికార పార్టీ టీడీపీ గూండాలను మాత్రం యథేచ్ఛగా నామినేషన్‌ కేంద్రంలోకి వదిలిపెట్టారు. టీడీపీ పార్లమెంట్‌ ఒంగోలు అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కనుసన్నల్లోను పచ్చమూకలు దాడులకు దిగుతున్నారని దద్దాల నారాయణ ధ్వజమెత్తారు.

పరిషత్‌ పోరుకు ముందుగానే బెదిరింపులు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే పురపాలక ఎన్నికల నామినేషన్‌ల మాదిరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్‌లను అడ్డుకోనేందుకు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఓ పక్కా వ్యూహం రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటి నుంచే పోలీసులు రంగంలోకి దిగి ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్‌లు వేయడానికి వీలు లేదని, బలవంతంగా నామినేషన్‌లు వేస్తే ఇబ్బందులు పడతారంటూ ఇప్పటికే వైఎస్సార్‌ సీపీ నేతలను కలిసి హెచ్చరికలు చేస్తున్నారు. పోలీసుల ఈ పచ్చపాత వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నా పోలీసుల మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement