శ్రీశైలం ఘాట్‌లో రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలం ఘాట్‌లో రోడ్డు ప్రమాదం

Sep 21 2026 12:38 AM | Updated on Sep 21 2026 12:38 AM

శ్రీశైలం ఘాట్‌లో రోడ్డు ప్రమాదం వెలిగొండ ప్రాజెక్టు పరిశీలన దళిత మహిళపై దాడి కేసు విచారణ పాతకక్షల నేపథ్యంలో మహిళపై దాడి

అదుపుతప్పి లోయలో పడిన

బొలారో వాహనం

ప్రాణాపాయం నుంచి త్రుటిలో

తప్పించుకున్న డ్రైవర్‌

పెద్దదోర్నాల: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బొలారో వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో వాహనం నడుపుతున్న డ్రైవర్‌ ఫణి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన శ్రీశైలం ఘాట్‌లోని చింతల గిరిజన గూడెం సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..కర్నూల్‌ నుంచి శ్రీశైలం వైపునకు అరటి కాయల లోడుతో వెళుతున్న బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి లోయలో పడింది. దీందో రాత్రంతా వాహనంలోనే గడిపిన అతన్ని గమనించిన ఓ కారులోని ప్రయాణికులు రోడ్డుపైకి చేర్చి సమాచారాన్ని 108కు సమాచారం ఇచ్చారు. 108 ఈఎంటీ సుభానీ, పైలెట్‌ శ్రీనివాసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రుడిని పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పెద్దదోర్నాల: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ను కలెక్టర్‌ ఎం విజయ సునీత ఆదివారం సందర్శించారు. నీటి నిల్వలను, ప్రాజెక్టును పరిశీలించారు. తొలుత కలెక్టర్‌ జలహారతి వ్యూ పాయింట్‌ను సందర్శించడంతో పాటు, టన్నెల్‌–2 ఎగ్జిట్‌ పాయింట్‌ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. ఆదివారం ఉదయం నల్లమల సాగర్‌ జలాశయంలో 6 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 243.8 మీటర్లుగా నమోదు కాగా, క్రాస్‌ రెగ్యులేటర్‌ వద్ద 4.05 కిలోమీటర్ల మేర నీటిమట్టం ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్లమల సాగర్‌కు 2,100 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలోని ఇంజినీరింగ్‌ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, నీటి విడుదల, నిర్వహణ ప్రక్రియలను సమర్థవంతంగా పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

తాళ్లూరు: మండలంలోని బొద్దికూరపాడులో ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న దళిత మహిళపై దాడి చేసిన ఘటనలో టీడీపీ నేత గంగిరెడ్డి బాలిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఆదివారం విచారణ చేపట్టారు. బాధిత మహిళ నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళకు న్యాయం చేయడంతో నిందితుడిని అరెస్టు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్సై ఎస్‌.మల్లికార్జునరావు, మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య, కాకుమాను రవి, ఇతర దళిత సంఘాల నాయుకలు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు రావినూతల కోటి మాదిగ ఏసమ్మ నివాసానికి వెళ్లి పరామర్శించారు.

లింగసముద్రం: పాతకక్షల నేపథ్యంలో మహిళపై దాడి చేసిన సంఘటన రాళ్లపాడు గ్రామంలో జరిగింది. ఎస్సై రాంబాబు అందించిన వివరాల ప్రకారం..రాళ్లపాడులో నివాసం ఉంటున్న గొల్లపల్లి మానస తన ఇంటి సమీపంలో మరుగుదొడ్డి కట్టుకునేందుకు ప్రయత్నించగా అదే గ్రామానికి చెందిన మద్దెల రామారావు అడ్డుకున్నాడు. ఇక్కడ మరుగుదొడ్డి కట్టడానికి వీల్లేదని, మరుగుదొడ్డి కడితే ఇబ్బందులు పడతావని హెచ్చరించాడు. అయితే ఈ నెల 15వ తేదీన వినాయకచవితి సందర్భంగా గ్రామంలో గణేష్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు రామాలయం వద్ద ఉన్న టీ బంకు దగ్గర మానస భర్త కిషన్‌కుమార్‌ ఉండగా అక్కడే ఉన్న ఇనకొల్లు బానుచందర్‌, మద్దెల రామారావు కిషన్‌కుమార్‌తో ఘర్షణ పడ్డారు. వారిద్దరు కిషన్‌కుమార్‌ను కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా మానస అడ్డుకున్నారు. పాతకక్షలు మనసులో పెట్టుకుని భానుచందర్‌, రామారావు మానసపై కర్రలతో దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన మానసను కుటుంభసభ్యులు కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి వచ్చిన ఫిర్యాదు ధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement