మార్కాపురం: భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న లక్షలాది మంది కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ అన్నారు. కార్మికులకు ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, ఆర్థిక సహాయం, పిల్లల విద్య, వివాహ సహాయం, ప్రసూతి ప్రయోజనాలు తదితర సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ సమావేశం బి.రోశయ్య అధ్యక్షతన ప్రజా సంఘాల కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో రఫీ మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని తెలిపారు. అక్టోబర్ 8వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించ నున్నట్లు తెలిపారు. భవనిర్మాణ కార్మిక సంఘం నాయకుడు టి.ఆవులయ్య మాట్లాడుతూ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రమాద బీమా, అంగవైకల్యం పాలైన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని, కొత్త కార్డులు నమోదు, పాత కార్లు రెన్యువల్ చేయాలని, 60 ఏళ్ల పైబడిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలన్నారు. ఎస్‌కే అన్వర్,పి.నరేంద్ర, న వై సింగరయ్య, బి.నరసింహులు, డి.తామస్, కె.ప్రభుదాస్, ఎస్‌కే లాల్‌బి, ఓ శ్రీనివాసులు, డి. గురయ్యా, యు పోలయ్య, వెంకట్ పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి


