ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీ | - | Sakshi
Sakshi News home page

ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీ

Sep 21 2026 12:38 AM | Updated on Sep 21 2026 12:38 AM

వరికుంటపాడు: వరికుంటపాడు పంచాయతీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఆదివారం బోలోరో, ఓమిని కారు ఎదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు మార్కాపురం జిల్లా పామూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. వివరాలలోకి వెళితే ఒంగోలు నుంచి మదనపల్లికి వెళ్తున్న బొలెరో వాహనం, చైన్నె క్రోసూరు నుంచి మార్కాపురం జిల్లా పెదచెర్లపల్లికి వెళ్తున్న మినీ కారు రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న లక్ష్మీనారాయణ (50), ప్రకాశం(40) ఇద్దరు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. సమాచారం అందుకున్న వరికుంటపాడు ఎస్సై కె. మధుసూదన్‌రావు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు అనంతరం కేసు నమోదు చేశారు.

ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement