ఏఎంఓగా వెంకటేశ్వర్లు | - | Sakshi
Sakshi News home page

ఏఎంఓగా వెంకటేశ్వర్లు

Aug 23 2026 2:04 AM | Updated on Aug 23 2026 2:04 AM

ఏఎంఓగా వెంకటేశ్వర్లు

మార్కాపురం: మార్కాపురం జిల్లా సర్వశిక్ష అభియాన్‌లో అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌గా పెద్దారవీడు మండలం వైడీపాడు ఉన్నత పాఠశాల బయోలాజికల్‌ సైన్సు టీచరుగా పనిచేస్తున్న బీసీహెచ్‌ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. డీఈఓ సుబ్బారావు నుంచి ఉత్తర్వులు అందుకుని బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థుల అభ్యాసన ప్రమాణాల మెరుగుదల, ఉపాధ్యాయుల అకడమిక్‌ సహకారం, పాఠశాలల పర్యవేక్షణ తదితర అంశాలపై దృష్టిపెడతానని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులు, ఎస్‌టీయూ రాష్ట్ర నాయకుడు ఎర్రయ్య పాల్గొన్నారు.

టాటూస్‌తో జూనియర్‌ డాక్టర్ల నిరసన

ఒంగోలు టౌన్‌: జూనియర్‌ డాక్టర్ల సమ్మె శనివారం 13వ రోజుకు చేరుకుంది. రోజులు గడస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో జూనియర్‌ డాక్టర్లు కూడా తగ్గేదేలేదని భిన్నరీతుల్లో పోరాటం కొనసాగిస్తున్నారు. తాజాగా టాటూస్‌తో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. చేతికి, ముఖం మీద రంగులతో తమ డిమాండ్లను టాటు వేసుకొని ప్రదర్శించడం ఆకట్టుకుంది.

3 శాతంతో మొండికేస్తున్న ప్రభుత్వం...

స్టైఫండ్‌ పెంచాలన్న ప్రధాన డిమాండ్‌తో జూనియర్‌ డాక్టర్లు సమ్మె ప్రారంభించారు. విడతల వారీగా సమ్మె చేస్తూ వచ్చారు. తొలి రెండు విడతల్లో అత్యవసర సేవలను మినహాయించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చే నిరుపేద సామాన్య రోగులను దృష్టిలో ఉంచుకొని సాధారణ వైద్య సేవలను మాత్రమే బహిష్కరించారు. తొలుత 30 శాతం స్టైఫండ్‌ పెంచాలని పట్టుపడిన జూడాలు ఆ తరువాత క్రమంగా 20 శాతం వరకు దిగివచ్చారు. వెంటనే స్టైఫండ్‌ చెల్లించాలన్న డిమాండ్‌ను కూడా సవరించుకున్నారు. తమకు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే చాలని కోరారు. జూడాలు పరిస్థితికి తగినట్లుగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం మాత్రం మొండికేస్తూ వస్తుందని జూనియర్‌ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. సమ్మెలో జూడా ప్రసిడెంట్‌ భార్గవ సాయి, క్రిస్‌ కాంత్‌, ఫైజ్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement