చినుకు రాలక.. మొక్క కదలక.. | - | Sakshi
Sakshi News home page

చినుకు రాలక.. మొక్క కదలక..

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

వన నర్సరీల్లో నిరుపయోగంగా

4 లక్షల మొక్కలు

హనుమంతునిపాడు: ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు పచ్చదనానికి గొడ్డలిపెట్టుగా మారాయి. వానలు ముఖం చాటేయడంతో హనుమంతునిపాడు, హాజీపురం అటవీ, ఉపాధి హామీ నర్సరీల్లో పెంచిన సుమారు 4 లక్షల మొక్కలు పంపిణీకి నోచుకోక అక్కడే ఉండిపోయాయి. నర్సరీల్లో ఎర్రచందనం, టేకు, నేరేడు, మామిడి తదితర పండ్ల, అటవీ జాతి మొక్కలను లక్షలు వెచ్చించి పెంచారు. వర్షాలు లేకపోవడంతో పొలం గట్లు, కుంటలు, రోడ్లకిరువైపులా నాటాల్సిన ఈ మొక్కలన్నీ నర్సరీలకే పరిమితమయ్యాయి. సమయం మించిపోతుండటంతో మొక్కలు పరిమితికి మించి పెరిగిపోతున్నాయి. వాటిని మరో కవర్‌లోకి మార్చి పెట్టే క్రమంలో వాడిపోతున్నాయి. వర్షాలు కురిస్తేనే పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement