సంస్కరణ పేరుతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

సంస్కరణ పేరుతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం

Jul 15 2026 5:03 AM | Updated on Jul 15 2026 5:03 AM

సంస్కరణ పేరుతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం

ఒంగోలు సిటీ: రాష్ట్రస్థాయిలో వేలాది మంది ఉపాధ్యాయులను తరలించి అసెంబ్లీని ముట్టడిస్తామని ఫ్యాప్టో రాష్ట్ర నాయకురాలు చెన్నుపాటి మంజుల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నిమిత్తం మంగళవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ర్యాలీ, పికెటింగ్‌ ధర్నా నిర్వహించారు. స్థానిక పాత జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్‌ వరకు నిర్వహించిన ర్యాలీకి ఫ్యాప్టో చైర్మన్‌ కె.ఎర్రయ్య నాయకత్వం వహించగా, జిల్లా సెక్రటరీ జనరల్‌ ఎస్‌.ఎండి. రఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఫ్యాప్టో నాయకురాలు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే ఈ ఆందోళన చేపట్టినట్లు తెలిపారు. ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను తక్షణమే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని, ఇన్‌–సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలన్నారు. టెట్‌ను ఆన్‌న్‌లైన్‌ కాకుండా ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించి కనీస ఉత్తీర్ణత మార్కులు నిర్ణయించాలని, ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. అదే విధంగా 2025 బదిలీల్లో రిలీవర్‌ లేక రిలీవ్‌ కాలేని ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్‌ చేయాలని, జిల్లా గేమ్స్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ నియామకంలో సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని, మున్సిపల్‌ ఉపాధ్యాయుల పీఎఫ్‌ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎంటీఎస్‌ టీచర్ల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, జీఓ నం.342 ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అవసరమైన సవరణలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఉన్నత పాఠశాలలో నాన్‌–టీచింగ్‌ సిబ్బంది, కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించాలని, కేజీబీవీ, మోడల్‌, గురుకుల, ఎయిడెడ్‌ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని, సాధారణ బదిలీలతో పాటు అంతర్‌ జిల్లా బదిలీలు కూడా నిర్వహించాలని కోరారు. ఆందోళనకు మద్దతుగా ప్రకాశం జిల్లా జేఏసీ చైర్మన్‌ సీహెచ్‌. శరత్‌బాబు, పెన్షనర్స్‌ నాయకులు సుబ్బారావు, జీవీ శేషయ్య, ఏఐటీయూసీ నాయకులు వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు రమేష్‌ పాల్గొని ఫ్యాప్టో ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. కె. ఎర్రయ్య, ఎస్‌.ఎండి. రఫీ, ఎస్‌.కే. అబ్దుల్‌ హై, బి. శేషారావు, కె. దేవసహాయం, వెంకట్రావు, వై. సీనయ్య, దార్ల జయరావు, అన్వర్‌బాష, రాష్ట్ర నాయకులు ఎస్‌ రవి, బి. వెంగళరెడ్డి, డి. శ్రీనివాసులు, కె.మోహన్‌న్‌రావు, పీవీ. సుబ్బారావు, వేమ శేషు, కిలారి వెంకటేశ్వర్లు, గవిని శివశంకర్‌, చేతల వెంకటేశ్వర్లు, ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

వేలాది మంది ఉపాధ్యాయులతో

అసెంబ్లీని ముట్టడిస్తాం

ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టర్‌ వద్ద ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement